Site icon HashtagU Telugu

Gangstar : కెనడా నుంచి ఢిల్లీ పోలీసులను బెదిరించిన గ్యాంగ్ స్టర్…”నేను పంజాబ్ లోకి అడుగుపెడితే”….!!

Gang Star

Gang Star

గ్యాంగ్ స్టర్ లఖ్ బీర్ సింగ్…పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకుని ప్రస్తుతం కెనడాలో తలదాచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీపోలీస్ స్పెషల్ సెల్ ను బెదిరిస్తూ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశాడు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ లో ఉన్న పోలీసు అధికారల ఫోటోలు మా దగ్గర ఉణ్నాయి. ఏ అధికారి అయినా పంజాబ్ లో అడుగుపెట్టాడో దాని పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చూడాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు. అయితే లఖ్ బీర్ సింగ్ కు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తోపాటు ఐఎస్ఐ సపోర్టు ఉందని సమాచారం. గ్యాంగ్ స్టర్ రిలీజ్ చేసిన వీడియో సంచలనంగా మారింది.

ఇటలీలో గ్యాంగ్ స్టర్ హర్ ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ మర్డర్ కు గురయ్యాడని లక్బిర్ సింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. హర్ ప్రీత్ సింగ్ ఢిల్లీ పోలీస్ స్పెషల్ , raw ఇన్మార్మర్ అందుకే అతన్ని చంపేశానంటూ వీడియోలో పేర్కొన్నాడు. లఖ్ బీర్ పై పంజాబ్ లో ఎన్నో కేసులు ఉన్నాయి. ఐఎస్ఐ కు అనుకూలంగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. తాజాగా శివసేన నేత హత్య, మొహాలీ ఆర్పీజీ దాడిలో లఖ్ మీర్ సింగ్ పేరు విచారణలో ఉంది. ఖలిస్తానీ టెర్రరిస్టు హర్విందర్ సింగ్ రిండాతో కలిసి లఖ్ బీర్ సింగ్ ఐఎస్ఐ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడు. కాగా పాక్ లో హర్విందర్ సింగ్ రిండా మరణించినట్లు వారం క్రితం వార్తలు వచ్చాయి.