Ganga Water Unsafe : గంగాజలం.. పరమ పవిత్రమైంది. దాని గొప్పతనం గురించి పురాణాలు, ప్రాచీన గ్రంథాల్లో స్పష్టమైన ప్రస్తావన ఉంది. హిందువులు గంగా మాతకు ప్రతిరూపంగా గంగా జలాన్ని భావిస్తుంటారు. అందుకే దానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. గంగా నదిలో పుణ్య స్నానాన్ని ఆచరిస్తే ఎన్నో పుణ్యఫలాలు లభిస్తాయని, మోక్షం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో ఉన్న గంగాజలంపై స్థానిక కాలుష్య నియంత్రణ బోర్డు ఆందోళన రేకెత్తించే నివేదికను విడుదల చేసింది.
Also Read :Bellamkonda Sreenivas : పెళ్లి పీటలు ఎక్కబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్
హరిద్వార్‌లో ఉన్న గంగాజలం(Ganga Water Unsafe) తాగడానికి పనికి రాదని ఆ నివేదికలో ప్రస్తావించారు. ఆ నీటిని భక్తులు స్నానాలకు మాత్రమే వాడుకోవాలని తెలిపింది. తాము ప్రతినెలా హరిద్వార్ పరిధిలోని గంగానదిలో 8 ప్రాంతాల్లో నీటి నాణ్యతపై పరీక్షలు నిర్వహిస్తుంటామని కాలుష్య నియంత్రణ బోర్డు పేర్కొంది. ఆ పరీక్షల్లో భాగంగా హరిద్వార్‌లోని నీరు ‘బి’ కేటగిరీలో ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. పీహెచ్, ఆక్సీజన్, బయోలాజికల్ ఆక్సిజన్, కోలిఫాం బ్యాక్టీరియా అనే నాలుగు ప్రమాణాల ఆధారంగా నీటి నాణ్యతను ఐదు కేటగిరీలుగా విభజించారు. హరిద్వార్‌లో గంగాజలం ‘బి’ కేటగిరీలో ఉంది. అంటే అది తాగడానికి పనికిరాదు. భక్తులు స్నానాలు చేయొచ్చు.
Also Read :Yuva Vikasam Meeting : పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా? : బిఆర్ఎస్ పై సీఎం రేవంత్ సెటైర్
మానవ వ్యర్థాల వల్లే గంగానదిలోని(Ganga Water Unsafe) జలాల స్వచ్ఛత దెబ్బతింటోందని పరిశీలకులు అంటున్నారు. పారిశ్రామిక వ్యర్థాలు, మురికి నీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ నదిలో పేరుకుపోతున్నాయి. ఢిల్లీలోని యమునా నదిలోనూ తీవ్రమైన జల కాలుష్యం ఉంది. ప్రమాదకర రసాయనాలు, మురుగు వచ్చి యమునా నదిలో కలుస్తోంది. గంగోత్రి నుంచి రిషికేశ్ వరకు ప్రవహించే గంగా నది జలాలను ఇటీవలే ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు టెస్ట్ చేశారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన 28 ప్రమాణాల ప్రకారం ఆ నీటిని పరీక్షించగా, అది సేఫ్ అని తేలింది.