మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలెన్ని తీసుకొచ్చినా…నిత్యం హత్యలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా యూపీలోని లక్నోలో జరిగిన ఘటన కలకలం రేపింది. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన విభూతిఖండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. విద్యార్థినిపై ఆటోడ్రైవర్, అతని సహచరుడు అత్యాచారానికి పాల్పడ్డారు. తలపై కొట్టడంతో ఆమె స్పృహ తప్పిపడిపోయింది. బాధితురాలిని తీసుకువచ్చి హుస్దియాలోని రోడ్డుపై పడేసి దుండగులు పరారయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…విభూతిఖండ్ కు చెందిన ఒక విద్యార్థి ట్యూషన్ నుంచి తిరిగి వస్తుంది. విద్యార్థిని అడ్డగించిన ఆటోడ్రైవర్, అతని స్నేహితుడి ఆమె ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడ్డారు. విద్యార్థిని ఎదురుతిరగడంతో…తలపై మోదారు. స్పృహ తప్పిన విద్యార్థినిని ఆటోలో ఎక్కించుకుని హుస్దియాలోని రోడ్డుపై పడేశారు. పట్టపగలే ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.