Gang Rape : నిండు గర్భిణీపై సామూహిక అత్యాచారం… మృత శిశువుతో ఎస్పీ ఆఫీస్ కు వెళ్లిన బాధితురాలి అత్త .!!

ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ నిండు గర్బిణీపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది.

Published By: HashtagU Telugu Desk
Gang Raped

Gang Raped

ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ నిండు గర్బిణీపై సామూహిక అత్యాచారం కలకలం రేపింది. నిండు గర్భిణీపై సమూహిక అత్యాచారం చేయడంతో గర్బంలోనే శిశువు మరణించింది. అత్యాచార బాధితురాలి అత్త తన చేతిలో పిండం తీసుకుని న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లడం…కలకలం రేగింది. ఈ ఘటన చూసిన జనాలు షాక్ కు గురయ్యారు. 7 నెలల గర్భిణీపై కొంతమంది దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…పొలం పనుల కోసం వెళ్లిన మహిళను అదే గ్రామానికి చెందిన వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. తన కోడలు ఎంతసేపటికి ఇంటికి చేరుకోకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె అత్త…పొలం దగ్గరకు వెళ్లేసరికి ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గర్భంలోనే శిశువు మరణించినట్లు తెలిపారు. అన్ని విధాలా ప్రయత్నించినా రక్షించలేకపోయామని వైద్యులు తెలిపారు. అత్యాచారం జరిగిన సమయంలో శిశువు మరణించినట్లు చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు..కవర్లో పిండాన్ని తీసుకుని ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.

మహిళ చేతిలో ఉన్న పిండాన్ని చూసిన ఎస్పీ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, సిబ్బంది షాక్ కు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్పీ విచారణకు ఆదేశింాచరు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 

  Last Updated: 22 Sep 2022, 12:00 PM IST