Site icon HashtagU Telugu

Crime : దారుణం..11 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్…స్కూల్ టాయిలెట్లోకి లాక్కెళ్లి…!!

Gang Raped

Gang Raped

దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ కేంద్రీయ విద్యాలయంలో 11 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు సీనియర్ విద్యార్థులు బాత్రూంలోకి లాకెళ్లి…అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ మహిళా కమిషన్ చొరవతో బాధితురాలు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఆ విద్యాలయంపై సంగతన్ ప్రాంతీయ కార్యాలయం కూడా విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటన చాలా తీవ్రమైన విషయంగా అభివర్ణించింది. పిల్లలకు కూడా పాఠశాలలు సురక్షితంగా కాకపోవడం బాధాకరమని..ఈ అంశంపై ఢిల్లీ పోలీసులకు, విద్యాలయం ప్రిన్సిపాల్ కు నోటీసులు జారీ చేసింది.

ఈ ఘటనపై ఎందుకు ఫిర్యాదు చేయలేదో వివరణ ఇవ్వాలంటూ పాఠశాల అధికారులను విచారించాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనపై బాధితురాలు లేదా ఆమె తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయలేదన్నారు. పోలీసుల విచారణ తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అధికారులు తెలిపారు. ఈ విద్యాలయం విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థ. దేశంలోని 25 ప్రాంతాలలో 1,200 కంటే ఎక్కువ కేంద్రీయ విద్యాలయాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది.

బాధితురాలు మంగళవారం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కమిషన్ ప్రకారం.. బాలిక జూలైలో తన తరగతికి వెళుతున్నప్పుడు, 11, 12 వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను సడెన్ గా తాకింది. ఈ క్ర‌మంలో వారు ఆమె క్ష‌మాపణలు చెప్పాల‌ని పట్టుబట్టారు. అనంత‌రం టాయిలెట్‌లోకి లాక్కెళ్లి తనపై అత్యాచారం చేశారని ఆ బాలిక ఆరోపించింది. ఆమె ఈ సంఘటన గురించి ఒక ఉపాధ్యాయుడికి చెప్పినప్పుుడ, అబ్బాయిలను సస్పెండ్ చేశామని చెప్పారని ఆమె ఆరోపించింది. ఈ విషయమై పాఠశాల అధికారులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కేవీఎస్ అధికారులు స్పష్టం చేశారు. పోలీసుల‌ విచారణ తర్వాతే ఈ విషయం మా దృష్టికి వచ్చిందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఢిల్లీ పోలీసుల విచారణకు మేం సహకరిస్తున్నామ‌న్నారు, దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.