Gallantry Award 2025 : కేంద్ర హోం శాఖ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది. పోలీసు, ఫైర్, హోంగార్డ్స్, సివిల్ డిఫెన్స్, కరక్షనల్ సర్వీసులకు గ్యాలంటరీ అవార్డులను అందజేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 942 మందికి ఎంపిక చేసినట్లు తెలిపింది. 95 మందికి గ్యాలంటరీ మెడల్స్, 101 మందికి రాష్ట్రపతి సేవా పథకం, 746 మందికి ఉత్తమ సేవా పథకం, గ్యాలంటరీ మెడల్స్ పొందిన 95 మందిలో 28 మంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలవారు కాగా… మరో 28 మంది జమ్ముకశ్మీర్‌లో పనిచేసినవారు ఉన్నారు.
తెలంగాణ నుంచి ఉత్తమ పోలీసు సేవా పథకం పొందిన వారిలో ఐజీ కార్తికేయ, ఎస్పీ అన్నల ముత్యంరెడ్డి, డిప్యూటీ కమిషనర్ కమాల్ల రాంకుమార్, డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ ఫజ్లుర్ రహమాన్, డీఎస్పీ కోటపాటి వెంకట రమణ, డీఎస్పీ అన్ను వేణుగోపాల్, ఏఎస్‌ఐ రణ్‌వీర్ సింగ్ ఠాకూర్, ఏఎస్‌ఐ పీటర్ జోసెఫ్ బహదూర్, ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ విదత్యా పాథ్యా నాయక్, హెడ్ కానిస్టేబుల్ ఎండీ అయూబ్ ఖాన్ ఉన్నారు.
తెలంగాణ నుంచి ఇద్దరు అధికారులకు పోలీస్ మెడల్స్, మరో 12 మందికి ఉత్తమ సేవా పథకాలు కేంద్ర హోం శాఖ అందజేయనుంది. కమిషనర్ విక్రంసింగ్ మన్, ఎస్పీ మెట్టు మాణిక్‌రాజ్‌కు గ్యాలంటరీ మెడల్స్ సాధించిన వారిలో ఉన్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ దాట్ల శ్రీనివాసవర్మకు పోలీసు మెడల్స్ ప్రకటించింది.