Gaganyaan Crew Module : వ్యోమగాములను ‘గగన్ యాన్’ కు తీసుకెళ్లే వెహికల్ ఇదిగో!

Gaganyaan Crew Module : అంత‌రిక్షంలోకి వ్యోమ‌గాముల్ని పంపేందుకు ఉద్దేశించిన ‘‘గగన్ యాన్’’ ప్రయోగం దిశగా ఇస్రో వడివడిగా అడుగులు వేస్తోంది.

  • Written By:
  • Updated On - October 7, 2023 / 02:58 PM IST

Gaganyaan Crew Module : అంత‌రిక్షంలోకి వ్యోమ‌గాముల్ని పంపేందుకు ఉద్దేశించిన ‘‘గగన్ యాన్’’ ప్రయోగం దిశగా ఇస్రో వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టులో క్రూ మాడ్యుల్ అత్యంత కీలకం. ఇది రెడీ అయిందని ఇస్రో ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫొటోలను శనివారం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌కు చెందిన టెస్ట్ వెహిక‌ల్ అబోర్ట్ మిష‌న్-1(టీవీ-డీ1) తయారీ ప్రక్రియ పూర్తయింది. టీవీ-డీ1 మాడ్యూల్‌ను ఇస్రోకు చెందిన లాంచింగ్ కాంప్లెక్స్‌కు చేర్చారు. టీవీ-డీ 1మాడ్యూల్ నిర్మాణం తుది ద‌శ‌లో ఉందని ఇస్రో తెలిపింది. ఈ మాడ్యూల్ 17 కిలోమీట‌ర్ల మేర ఎత్తుకు వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి అబార్ట్ సీక్వెన్స్‌లో భాగంగా మ‌ళ్లీ భూమి మీదికి వచ్చేస్తుంది. పారాచూట్ల సాయంతో అది తిరిగి భూమిపై ల్యాండ్ అవుతుంది. గగన్ యాన్ ప్రయోగంలో భాగంగా.. శ్రీహ‌రికోట నుంచి 10 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స‌ముద్ర ప్రాంతంలో ఆ మాడ్యూల్ ల్యాండ్‌ అవుతుంది.  త్వరలోనే ఈ క్రూ మాడ్యూల్ తో పరీక్షలు నిర్వహించేందుకు ఇస్రో సమాయత్తం అవుతోంది.

We’re now on WhatsApp. Click to Join

గగన్ యాన్ క్రూ మాడ్యూల్ లోనే వ్యోమ‌గాములు నింగిలోకి వెళ్తారు.  టెస్టింగ్ లో భాగంగా ఆ మాడ్యూల్‌ను నింగిలోకి పంపి, మ‌ళ్లీ భూమిపై దించాలని ఇస్రో భావిస్తోంది. ఈ ప‌రీక్ష స‌మ‌యంలో క్రూ మాడ్యూల్ బంగాళాఖాతంలో ల్యాండ్ అవుతుంది. స‌ముద్రం నుంచి ఇండియ‌న్ నేవీ ఆ మాడ్యూల్ మెష‌న్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం క్రూ మాడ్యూల్‌ను బెంగుళూరులోని ఇస్రో సెంట‌ర్‌లో టెస్టింగ్ చేస్తున్నారు. టెస్ట్ ఫ్లయిట్ స‌క్సెస్ అయిన త‌ర్వాత గ‌గ‌న్‌యాన్ మిష‌న్ ను (Gaganyaan Crew Module) చేప‌ట్టనున్నారు.