G 20 సదస్సు(G20 Summit)కు దేశ రాజధాని ఢిల్లీ(Delhi) ముస్తాబవుతోంది. ఈ శిఖరాగ్ర సదస్సు నిర్వహణకోసం భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను ఎలాంటి లోపం లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో జీ-20 సదస్సుకు సర్వం సిద్ధం చేశారు. ప్రపంచ ఆర్థిక సవాళ్ళు, దౌత్య సంబంధాలు, రంగాల వారీగా భవిష్యత్ లక్ష్యాలపై ఈ జీ-20 సదస్సులో చర్చించనున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) అధ్యక్షతన సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ప్రగతి మైదాన్ భారత్ మండపంలో శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. శిఖరాగ్ర సమావేశాలకు జీ20 దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడు జో బైడన్(Joe Biden) ఢిల్లీకి చేరుకోనున్నారు.
జి 20 సమావేశాలకు హాజరుకానున్న దేశాధినేతలు వీళ్ళే..
అమెరికా అధ్యక్షుడు – జో బైడెన్
బ్రిటన్ ప్రధాని – రిషి సునాక్
ఆస్ట్రేలియా ప్రధాని – ఆంధోనీ ఆల్బనిస్
కెనెడా ప్రధాని – జస్టిన్ ట్రూడో
జర్మనీ ఛాన్సలర్ – ఒలాఫ్ షోల్జ్
జపాన్ ప్రధాని – పుమియో కిషిద
దక్షిణ కొరియా అధ్యక్షుడు – యూన్ సుక్ యేల్
ఫ్రాన్స్ అధ్యక్షుడు – ఇమ్మన్యుయేల్ మెక్రన్
చైనా ప్రధాని – లీ చియాంగ్
రష్యా విదేశాంగ మంత్రి – లాల్ సెర్గి లావ్రోర్
బంగ్లాదేశ్ ప్రధాని – షేక్ హసీనా
తుర్కియే అధ్యక్షుడు – ఎర్డోగన్
అర్జెంటీనా అధ్యక్షుడు – ఫెర్నాండెజ్
నైజీరియా అధ్యక్షుడు – బొలా తినుబు
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు – సిరీల్ రమఫోసాలు
జీ 20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇటలీ ప్రధాని, ఇండోనేషియా అధ్యక్షుడు, మెక్సికో అధ్యక్షుడు, ఐరోపా యూనియన్ అధ్యక్షురాలు, చైనా అధ్యక్షుడు హాజరు అయ్యే అవకాశాలు కనిపించట్లేదు.
Also Read : G20 Summit Delhi : G20 సదస్సుకు ముస్తాబవుతున్న ఢిల్లీ.. ఆ సేవలపై నిషేధం.. వారికి సెలవులు..