G20 : థ‌ర్మ‌ల్ ప్రాజెక్టుల‌కు ఫైనాన్స్ ఇక లేన‌ట్టే!

జీరో ఉద్గార ల‌క్ష్యాన్ని నిర్దేశించ‌డంలో జీ20 దేశాల స‌మావేశం వైఫ్య‌లం చెందింది. ఐదు దేశాల అధినేత‌లు ఈ స‌మావేశానికి డుమ్మా కొట్టాడ‌రు. అభివృద్ధి చెందుతోన్న‌, వెనుక బ‌డిన దేశాల ప‌క్షాన భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ త‌న వాయిస్ ను వినిపించారు.

  • Written By:
  • Updated On - November 1, 2021 / 02:50 PM IST

జీరో ఉద్గార ల‌క్ష్యాన్ని నిర్దేశించ‌డంలో జీ20 దేశాల స‌మావేశం వైఫ్య‌లం చెందింది. ఐదు దేశాల అధినేత‌లు ఈ స‌మావేశానికి డుమ్మా కొట్టాడ‌రు. అభివృద్ధి చెందుతోన్న‌, వెనుక బ‌డిన దేశాల ప‌క్షాన భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ త‌న వాయిస్ ను వినిపించారు. ఈ ఏడాది నుంచి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్ప‌త్తి ప్లాంట్ల‌కు అంత‌ర్జాతీయ నిధుల‌ను ఇవ్వ‌డానికి లేద‌ని జీ 20దేశాల స‌మావేశం తీర్మానించింది. ప్ర‌పంచం మొత్తానికి ఒకే ఆరోగ్యం ఆనే సూత్రాన్ని అనుస‌రించాల‌ని ప్ర‌తినిధులు పిలుపునిచ్చారు. ప్ర‌తి ఏడాది 100 బిలియ‌న్ డాల‌ర్లు ఉద్గారాల త‌గ్గింపు కోసం 2025 వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టాల‌ని జీ 20 స‌మావేశం నిర్ణ‌యించింది.

చైనా, రష్యా, జపాన్, దక్షిణాఫ్రికా మరియు మెక్సికోకు చెందిన మంత్రులు మాత్ర‌మే జీ 20 స‌మావేశాల్లో పాల్గొన్నారు. ముగింపు స‌మావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ “అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను పరిరక్షించడం” కోసం భార‌త్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంద‌ని తెలిపారు. ప్ర‌పంచంలోని బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను క‌లిగిన దేశాల నాయ‌కులతో రోమ్ లో జ‌రిగిన శిఖరాగ్ర స‌మావేశం ముగిసింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సంవత్సరానికి $ 100 బిలియన్లను అందించాల‌ని ఆ స‌మావేశం తీర్మానం చేసింది. COVID మహమ్మారిపై పోరాడటానికి ఎక్కువ టీకా సమానత్వం ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డింది. “శతాబ్దపు మధ్యలో కార్బన్ ఉద్గారాలపై జీరో ఉద్గారాల ల‌క్ష్యాన్ని సాధించే దిశ‌గా వెళ్లాల‌ని స‌మావేశం భావించింది. ఒకే ప్ర‌పంచం ఒకే ఆరోగ్యం నినాదంలో భాగంగా కోవిడ్ -19 నివార‌ణ కోసం మ‌రిన్ని వ్యాక్సిన్ల‌ను గుర్తించాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ల‌కు జీ20 స‌మావేశం సూచించింది. అందుకోసం ఆర్థిక‌, సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అన్ని దేశాల‌కు అందించాల‌ని కోరింది. ఆఫ్రికా, బ్రెజిల్ , అర్జెంటీనా, గ్రీస్ త‌దిత‌ర దేశాలు ప‌ర్యావ‌ర‌ణ సంర‌క్ష‌ణల‌ ప్రాజెక్ట్‌ల కోసం అంతర్జాతీయంగా పబ్లిక్, ప్రైవేట్ ఫైనాన్సింగ్ వెసుల‌బాటు క‌ల్పించాల‌ని భావించింది. తక్కువగా అభివృద్ధి చెందిన దేశాలు , అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల కోసం మూలధనాన్ని ఎక్కువ‌గా ఉండేలా చేయ‌డానికి అభివృద్ధి చెందిన దేశాలు నిబద్ధత ఉండాల‌ని పారిస్ ఒప్పందంపై స‌మీక్షించింది.

UKలో 15-రోజుల ఈవెంట్ ప్రారంభోత్సవానికి శ్రీ మోదీ హాజరు కానున్నారు. అక్క‌డ మ‌రిన్ని చర్చలు, ముఖ్యంగా 1.5 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉష్ణోగ్రతను నియంత్రించ‌డానికి ప్రపంచ దేశాల‌ కట్టుబాట్లపై కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.
ప్రపంచంలోని గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో దాదాపు 80% వాటాను కలిగి ఉన్న 20 దేశాలు లక్ష్యాలను చేరుకోవాల‌ని జీ20 సూచించింది.గ్లాస్గో సమ్మిట్ విజయంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపేలా నిర్ణ‌యాలు ఉండాల‌ని భావించింది. జీ 20 స‌మ్మిట్ సాధించిన పెద్ద విజ‌యాలు ఈ స‌మావేశంలో ఏమీ క‌నిపించ‌క‌పోవ‌డం విచిత్రం.