Site icon HashtagU Telugu

One Rupee – Full Meals : రూపాయికే ఫుల్ మీల్స్.. చేపలు, మాంసం, గుడ్లు కూడా!

One Rupee Full Meals

One Rupee Full Meals

One Rupee – Full Meals : అక్కడ మధ్యాహ్నం పూట ఒక్క రూపాయికే ఫుల్ మీల్స్ ఇస్తారు. రూపాయే ఇచ్చారు కాబట్టి మెనూ ఏం మారదు !! చేపలు, మాంసం, గుడ్లతో పాటు  వైట్ రైస్, పప్పు, ఒక కూర, చట్నీలను మెనూలో  మీకు అందిస్తారు. ప్రతిరోజూ లంచ్ టైంలో ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఇదెక్కడ అని ఆలోచిస్తున్నారా ? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join

  • పశ్చిమ బెంగాల్‌లోని బీర్భం ప్రాంతంలో ఉన్న  ‘కంకలితల’  51 శక్తి పీఠాల్లో ఒకటి.
  • ఎంతోమంది భక్తులు, సన్యాసులు నిత్యం ఇక్కడ దర్శనానికి వస్తుంటారు.
  • ‘కంకలితల’ పట్టణ ప్రజలు ‘కంకలితల’ ఆలయాన్ని ఆనుకుని టిన్ షెడ్‌ను నిర్మించారు.
  • ఈ టిన్ షెడ్‌లోనే రూపాయికి ఫుల్ మీల్స్‌ను రోజూ మధ్యాహ్నం అందిస్తుంటారు.
  • నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ రూపాయి ఇచ్చి  ఫుల్ మీల్స్ తింటారు.
  • కంకలితల ఆలయ సేవాయత్, సాధుశాంత్, కంకలితల గ్రామపంచాయతీ సభ్యులు కలిసి రూపాయికే ఫుల్ మీల్స్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంచిదేశ్ ఆలయ కమిటీ  కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తోంది.
  • ఈ కార్యక్రమానికి కంకలితల గ్రామపంచాయతీ సైతం అండగా నిలుస్తోంది.
  • స్థానికంగా నిరుపేదలైన దాదాపు 500 మందికిపైగా ఇక్కడ నిత్యం భోజనం చేస్తుంటారు.
  • వారంలో ప్రతీరోజు ఒక్కో రకమైన వెరైటీ మెనూను భక్తులకు అందిస్తారు. ఇందులో ప్రతిరోజు తప్పకుండా నాన్ వెజ్ ఉంటుంది.
  • ఆకలితో ఉన్న పాదచారులకు అండగా ఉండే సదుద్దేశంతోనే రూపాయికి ఫుల్ మీల్స్(One Rupee – Full Meals) అందిస్తున్నామని కంకలితల గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడు మహ్మద్‌ ఒహియుద్దీన్‌ తెలిపారు. ఎంతో మంది దాతలు ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తునట్లు చెప్పారు.