Site icon HashtagU Telugu

Delhi : పెట్రోల్..డీజిల్ కావాలంటే…ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే..!!

Petrol And Diesel Prices

Petrol And Diesel Prices

ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు ఆప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. PUC పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటేనే ఇంధనం పోసే నిబంధనను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. పీయూసీ సర్టిఫికెట్ లేకుండా పెట్రోల్ పంపులకు వెళ్తే పెట్రోలు కానీ డిజీల్ కానీ పోయారని స్పష్టం చేసింది. ఈ నిబంధన అక్టోబర్ 25 నుంచి అమల్లోకి వస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. పర్యావరణం, ట్రాఫిక్, రవాణా విభాగాలకు చెందిన అధికారులతో ఆయన నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఢిల్లీలో కాలుష్య స్థాయి పెరగడానికి వాహన ఉద్గారాలే కారణమన్నారు. దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే అక్టోబర్ 25 నుంచి వాహనానికి సంబంధించిన పీయూసీ సర్టిఫికెట్ లేకుండా పెట్రోలు పంపుల వద్ద పెట్రోలు, డీజిల్ అందుబాటులో ఉండదని నిర్ణియించినట్లు తెలిపారు. ఈ వారం చివరి నాటికి ఈ పథఖం ఎలా అమలు చేయాలన్నదానిపై స్పష్టత వస్తుందన్నారు.