Indian Plane : ఫ్రాన్స్ చెర నుంచి విముక్తి.. ఆ విమానాన్ని ఆరు రోజులు ఎందుకు ఆపారంటే..

Indian Plane : ఆరు రోజుల ఉత్కంఠకు తెరపడింది.

  • Written By:
  • Updated On - December 26, 2023 / 12:40 PM IST

Indian Plane : ఆరు రోజుల ఉత్కంఠకు తెరపడింది. మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్‌లో ఇన్ని రోజులుగా నిర్భంధంలో ఉన్న రుమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున ముంబైలో ల్యాండ్ అయింది. దాదాపు 276 మంది భారతీయ ప్రయాణికులతో కూడిన ఆ విమానం ఎట్టకేలకు ముంబైకు చేరుకుంది. ఇద్దరు మైనర్లతోపాటు 25 మంది ప్రయాణికులు ఫ్రాన్స్‌లోనే దిగిపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

అసలేం జరిగింది ?

  • రుమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం దుబాయ్ నుంచి నికరాగ్వాకు బయలుదేరింది.
  • అందులో 303 మంది భారతీయ ప్రయాణికులు ఉన్నారు.
  • ఈ విమానం(Indian Plane) ఇంధనం నింపుకోవడం కోసం ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో ఆగింది.
  • అయితే మానవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో ఫ్రెంచ్ అధికారులు ఆ విమానాన్ని అదుపులోకి తీసుకున్నారు.
  • దీనిపై స్పందించిన ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో చర్చించింది.
  • ఈ ఘటనపై వెంటనే ఫ్రాన్స్ ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించింది.
  • ఓ కంపెనీ క్లయింట్ కోసం విమానాన్ని నడిపామని, మానవ అక్రమ రవాణా ఆరోపణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని లెజెండ్ ఎయిర్‌లైన్స్ న్యాయవాది స్పష్టం చేశారు.
  • చివరకు ఈ కేసును న్యాయమూర్తులు రద్దు చేశారు. విమానం బయలుదేరేందుకు అనుమతులు ఇచ్చారు.
  • నికరాగ్వా బార్డర్ నుంచి రోడ్డు మార్గంలో అమెరికాకు కేవలం 54 గంటల్లో వెళ్లొచ్చు.
  • పెద్దసంఖ్యలో భారతీయులు నికరాగ్వా నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకే నికరాగ్వాకు వెళ్తున్నారనే సమాచారం అందడంతో ఈ తనిఖీలు చేశారు.
  • ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 96,917 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ ఆర్మీకి దొరికిపోయారు.  ఇది గత సంవత్సరంతో పోలిస్తే 51.61 శాతం ఎక్కువ.
  • మానవ అక్రమ రవాణా రుజువైతే అమెరికాలో 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.

Also Read: New Criminal Laws : మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో ఏముంది ?