freebies : పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఉచితాలపై ఈ వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు వీటిని ప్రకటించే పద్ధతి మంచి కాదని వ్యాఖ్యానించింది. అయితే ఉచిత పథకాలు మంచివి కావు. దురదృష్టవశాత్తూ, వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం లేదు. ఉచిత రేషన్,డబ్బులు అందుతుండటంతో ఎలాంటి పని చేయకుండానే ఆదాయం లభిస్తోంది. ప్రజలకు సౌకర్యాలను అందించాలనే ప్రభుత్వాల లక్ష్య మంచిదే. కానీ వారిని దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి.
Read Also: YS Jagan : వైసీపీ ఓటమిపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఉచితాల వల్ల అది జరుగుతోందా? ఎన్నికల సమయంలో ఇలాంటి ఉచిత వాగ్దానాలు ప్రకటించడం సరైన విధానం కాదు అని జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్రప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను పూర్తి చేసే పనిలో ఉందని.. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యలను పరిష్కరించేందుకు యోచిస్తున్నట్లు అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి ఈసందర్భంగా ధర్మాసనానికి తెలిపారు. అయితే దీనిపై సుప్రీం కోర్టు న్యాయస్థానం స్పందిస్తూ.. ఈ నిర్మూలన మిషన్ ఎంతకాలం పాటు పని చేస్తుందో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌ను మరో ఆరు వారాల తర్వాత విచారిస్తామని వాయిదా వేసింది.
Read Also: Nara Lokesh : ఏపీలో పెట్టుబడులు పెట్టండి – సిఫీకి లోకేశ్ ఆహ్వానం