Site icon HashtagU Telugu

2 Lakhs Insurance Free : ఈ-శ్రమ్ కార్డుతో 2 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ

2 Lakhs Insurance Free

2 Lakhs Insurance Free

2 Lakhs Insurance Free : అసంఘటిత రంగ కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ కార్డులను (e-Shram Card) అందిస్తోంది. దీన్నే శ్రామిక్ కార్డుగా పిలుస్తారు. దీని ద్వారా రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమాను ఉచితంగా పొందొచ్చు. అసంఘటిత రంగ కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఉండవు. గ్రాట్యుటీ అంటేనే వీళ్లకు తెలియదు. అటువంటి శ్రమ జీవుల భవిష్యత్తు భద్రత కోసం, వృద్ధాప్యంలో వారికి ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ కార్డును(2 Lakhs Insurance Free) అందిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

  • e-Shram Card పేరిట పోర్టల్‌ను 2021 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
  • ఇప్పటి వరకు 28 కోట్ల ఈ-శ్రమ్ కార్డులను కేంద్ర సర్కారు మంజూరు చేసింది.
  • ఈ కార్డు తీసుకున్న కార్మికులు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై పాక్షిక వికలాంగులుగా మారితే కేంద్ర ప్రభుత్వం రూ.1 లక్ష చెల్లిస్తుంది. శాశ్వత వైకల్యం లేదా మరణం సంభవించినప్పుడు రూ. 2 లక్షల బీమా కవరేజీ బాధిత కుటుంబానికి  లభిస్తుంది.
  • ఈ-శ్రమ్ కార్డు ఉన్నవారి పిల్లలకు ఉచిత సైకిళ్లు, పని ముట్లు, కుట్టు మిషన్లు వంటి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి.
  • పరిశ్రమల్లో పని చేసే కార్మికులు, రోజు వారీ కూలీలు, వీధి వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, రూ.15 వేలలోపు వేతనాలున్న ఉద్యోగులు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఆదాయపు పన్ను చెల్లించని వారు, రేషన్‌కార్డు దారులు ఇలా 16 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న వారు e-Shram Cardకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: KTR Tweet : తెలంగాణలోనూ కర్ణాటక సీనే రిపీట్ చేస్తారా.. సిద్ధరామయ్య వీడియోపై కేటీఆర్ కామెంట్