Maharashtra: కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఉచిత విద్య…!!

కోవిడ్...మనిషి ఆరోగ్యంపైనేకాదు...బంధాలు, బంధుత్వాలనూ దూరం చేసింది.

  • Written By:
  • Publish Date - October 14, 2022 / 02:16 PM IST

కోవిడ్…మనిషి ఆరోగ్యంపైనేకాదు…బంధాలు, బంధుత్వాలనూ దూరం చేసింది. గత రెండేళ్లలో కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్యను అందించాలని మహా సర్కార్ నిర్ణయించింది. గ్రాడ్యేయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ లలో చదువుతున్న విద్యార్థులకు ఆర్ధిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరంగా కాకుండా ఉండేందుకు వరుసగా రెండోఏడాది కూడా ఉచిత విద్యను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత, సాంకేతిక విద్యామంత్రి చంద్రకాంత్ పాటిల్ తెలిపారు.

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల చదువు పూర్తయ్యేవరకు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు సంబంధించి పూర్తి ఫీజు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఏడాది కూడా పూర్తి ఫీజు మినహాయింపు నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని పాటిల్ అన్నారు: “విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్ కళాశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టబడింది, తద్వారా అలాంటి విద్యార్థుల విద్యను మెరుగుపరుస్తుంది. అంతరాయం కలిగించలేదు లేదా వారి విద్య దెబ్బతినదంటూ పేర్కొన్నారు.

కాగా “వివిధ ప్రభుత్వ కళాశాలలకు చెందిన 931 మంది అండర్ గ్రాడ్యుయేట్, 228 పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు COVID-19 మహమ్మారి కారణంగా తమ తల్లిదండ్రులను కోల్పోయారు. మొత్తం కోర్సు ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది” అని పాటిల్ చెప్పారు. ఉచిత విద్యను అందించాలన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ. 2కోట్లకు పైగా భారం పడుతుందని మంత్రి తెలిపారు.