Free Aadhaar Updation : ఫ్రీగా ‘ఆధార్‌’ వివరాల అప్‌డేట్‌.. గడువు పెరిగిందోచ్

ఆధార్ కార్డులోని వివరాలను మీరు ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా ?

  • Written By:
  • Publish Date - June 13, 2024 / 02:37 PM IST

Free Aadhaar Updation : ఆధార్ కార్డులోని వివరాలను మీరు ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా ? అయితే మీకు మంచి అవకాశాన్ని ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) కల్పిస్తోంది.  వాస్తవానికి రేపటి (ఈనెల 14)తో దీనికి సంబంధించిన గడువు ముగియనుంది. ఈ తరుణంలో దేశ ప్రజల సౌకర్యార్ధం UIDAI కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఉచితంగా ఆధార్ కార్డులోని వివరాలను అప్‌డేట్ చేసుకునే గడువును సెప్టెంబర్‌ 14 వరకు పొడిగించింది.

We’re now on WhatsApp. Click to Join

ఆధార్‌ కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలని భావించే వారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఉచిత సేవలు ‘మై ఆధార్‌’ పోర్టల్‌ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఈ పోర్టల్ ద్వారా పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి మార్పులను చేసుకోవచ్చు. సెప్టెంబరు 14న ఉచితం(Free Aadhaar Updation) గడువు ముగుస్తుంది. ఆ తర్వాత ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి మనం ఆధార్ కార్డులోని వివరాలను అప్‌డేట్‌ చేయించుకోవచ్చు. ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను ప్రతి ఒక్కరు అప్‌డేట్‌ చేసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. దీని కోసం ఆయా రుజువు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఆధార్‌ కార్డు వివరాల అప్‌డేట్ ఇలా.. 

ఆన్‌లైన్‌లో ఆధార్‌ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవాలని భావించేవారు తొలుత  యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఆధార్‌ నెంబర్‌ ద్వారా లాగిన్‌ కావాలి. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీతో లాగిన్‌ కావాలి. ఆ తర్వాత కార్డులోని వివరాలు మీకు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అవి సరైనవో కావో చెక్‌ చేసుకోవాలి. వీటిలో సవరణ అవసరమైతే చేయాలి. అనంతరం వేరిఫై చేసుకొని నెక్ట్స్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. తదుపరిగా కనిపించే డ్రాప్‌డౌన్‌ లిస్టులో మనం డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేయాలి. చివరగా సబ్మిట్‌ బటన్‌పై  క్లిక్‌ చేయాలి. ఇదంతా చేశాక మన ఫోనుకు 14 అంకెల ‘అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నెంబర్‌’ వస్తుంది. ఈనంబరుకు వాడుకొని మన ఆధార్ కార్డు అప్‌డేట్‌ స్టేటస్‌‌ను మనం చెక్ చేయొచ్చు.

Also Read :Text Books : మారని ‘ముందు మాట’.. పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు