Janata Curfew: జనతా కర్ఫ్యూకి నాలుగేళ్లు.. 2020 మార్చి 22న ఏం జ‌రిగిందంటే..?

కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం 2020 మార్చి 22న దేశంలో 'జనతా కర్ఫ్యూ' (Janata Curfew) విధించింది.

  • Written By:
  • Updated On - March 22, 2024 / 11:42 AM IST

Janata Curfew: కొవిడ్ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. అయితే, కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం 2020 మార్చి 22న దేశంలో ‘జనతా కర్ఫ్యూ’ (Janata Curfew) విధించింది. నేటికి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఆ తర్వాత క్రమంగా దాదాపు 2 నెలల పాటు లాక్డ్ డౌన్ కొనసాగింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నా.. ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాని నుంచి కోలుకునేందుకు ఏడాది పట్టింది.

2020 సంవత్సరం ప్రారంభంలో దేశం, ప్రపంచం కరోనా కాలంతో పోరాడటానికి సిద్ధమవుతున్నప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2020వ‌ సంవత్సరం మార్చి 19 న 135 కోట్ల మంది దేశ ప్రజలకు ఒక‌ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ చేసిన ఈ విజ్ఞప్తి ప్రభావం వల్ల దేశం మొత్తం 24 గంటల పాటు నిశ్శబ్దమైంది. అదే జనతా కర్ఫ్యూ. నేటికి నాలుగేళ్లు పూర్తయింది.

Also Read: Devil: బుల్లితెరపై డెవిల్ మేకర్స్ కి భారీ షాక్.. అస్సలు ఊహించలేదుగా?

2020వ సంవ‌త్స‌రం జనవరి 30న భారతదేశంలో మొదటి కరోనా వైరస్ కేసు నమోదైంది. ఆ సమయంలో ఈ వ్యాధి ఎలా ఉంటుందో..? ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే క‌రోనా వైర‌స్ తీవ్ర రూపం దాల్చిందో.. మార్చిలో కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. ఈ క్రమంలో 2020 మార్చి 22న ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా పబ్లిక్ కర్ఫ్యూ విధించారు.

We’re now on WhatsApp : Click to Join

ఈ జనతా కర్ఫ్యూ కింద ప్రతి ఒక్కరూ ఉదయం 7 నుండి రాత్రి 9 గంటల వరకు తమ ఇళ్లకే పరిమితం కావాల్సి వ‌చ్చింది. ముఖ్యమైన రంగాలకు సంబంధించిన వ్యక్తులు పని చేయడానికి అనుమతించబడ్డారు. జనతా కర్ఫ్యూ 22 మార్చి 2020 అంటే ఆదివారం విధించబడింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ 19 మార్చి 2020న రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అప్పుడు ప్రధాని కరోనా వైరస్ ముప్పును ముందుకు తెచ్చారు. మార్చి 22న పబ్లిక్ కర్ఫ్యూని పాటించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు.