Snow falls : గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లో మంచు కురుస్తుండటంతో భారీగా మంచు చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. వాటిని తొలగిస్తున్న కార్మికుల్లో 55 మంది అక్కడే చిక్కుకుపోయారు. నిన్నటి నుంచి కొనసాగుతోన్న సహాయక చర్యల్లో భాగంగా ఆర్మీ 50 మందిని రక్షించింది. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండగా.. జోషిమఠ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఇంకా ఐదుగురిని కాపాడేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి వరకే 33 మందిని కాపాడారు. వర్షం, మంచు తుఫాన్ వల్ల.. రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందికరంగా మారింది. శుక్రవారం రాత్రి ఆపరేషన్ నిలిపివేశారు.
Read Also: SLBC: ఎల్ఎల్బీసీలో గల్లంతైన 8 మంది జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది: మంత్రి
దీంతో ఇవాళ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఐటీబీపీ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టినట్లు జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసర్ ఎన్‌కే జోషీ తెలిపారు. మంచుచరియలు విరిగిపడ్డ ప్రదేశాన్ని ఈరోజు సీఎం పుష్కర్ సింగ్ ధామీ పర్యటించే అవకాశాలు ఉన్నాయి. కాగా, జాతీయరహదారిపై భారీగా పేరుకుపోయిన మంచుమేటలను సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ) సిబ్బంది తొలగిస్తున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. మంచుతో కూడిన వర్షం దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. నిన్న 33 మందిని, ఈ రోజు 17 మందిని ఆర్మీ కాపాడింది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో హెలికాప్టర్‌లో జోషిమఠ్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు భారత ఆర్మీ తెలిపింది.
Read Also: Shock To Old Vehicles: పాత వాహనాలకు షాక్.. పెట్రోలు బంకుల్లో ఇక నో పెట్రోల్