ISIS Terrorists: నలుగురు ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులను అహ్మదాబాద్(Ahmedabad)లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) సోమవారం అరెస్టు చేసింది. ఆ నలుగురు శ్రీలంక జాతీయులు(Sri Lankan nationals) అని తెలిసింది. కేంద్ర నిఘా వర్గాల నుండి వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. టెర్రరిస్టులందరూ శ్రీలంకకు చెందిన వారేనని ఏటీఎస్ అధికారులు తెలిపారు. వారు అహ్మదాబాద్ ఎందుకు వచ్చారు, వారి ఉద్దేశం ఏంటి అనే విషయాలపై దర్యాప్తు ప్రారంభించారు. వారిని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
పూర్తి వివరాలను అధికారులు వెల్లడించలేదు. అయితే వారు శ్రీలంక నుంచి చెన్నయ్ మీదుగా అహ్మదాబాద్ వచ్చినట్టు సమాచారం. దేశంలో భారీ దాడి చేయడానికి కుట్రపన్నినట్టు కూడా తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన అహ్మదాబాద్‌లోని 36 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు పట్టుపడటం కలకలం రేపుతోంది.