4 Day A Week: వారానికి నాలుగు రోజులే పని.. కొత్త లేబర్ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే?

కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కొత్త లేబర్ చట్టాలను తీసుకువచ్చింది. అయితే

  • Written By:
  • Updated On - August 9, 2022 / 10:54 PM IST

కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కొత్త లేబర్ చట్టాలను తీసుకువచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు కార్మిక చట్టాలు జులై ఒకటి నుంచి అమలులోకి రావాల్సి ఉండగా కానీ అవి ఇంతవరకు అమలు కాలేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆ నాలుగు కార్మిక చట్టాలు కనుక అమలు అయితే ఉద్యోగుల వేతనం, పీఎఫ్ వాటా, అదేవిధంగా పని సమయం, వీక్లీ ఆఫ్ వంటి అంశాలలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు కొత్త చట్టాలను పార్లమెంటు ద్వారా ఆమోదించినప్పటికీ, పలు రాష్ట్రాలు ఇంకా కొత్త కోడ్ లను ఆమోదించలేదు. అయితే రాజ్యాంగం పరిధిలో కార్మిక అంశం ఉన్నందున అమలులో జాప్యం జరిగింది.

అనేక రాష్ట్రాలు వాటినే ఆమోదించిన తరువాతే ఈ నాలుగు కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు 31 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతనాల కోడ్ 2019 కింద ముసాయిదా నిబంధనలు ప్రచురించడం జరిగింది. అయితే త్వరలోనే అమల్లోకి రానున్న ఈ కొత్త లేబర్ కోడ్ ఉద్యోగుల పని సమయం, టేక్ హోమ్ శాలరీ, అలాగే సెలవులపై ప్రభావం చూపనుంది. అదేవిధంగా ఉద్యోగి చివరి వర్కింగ్ డేస్ వరకు చెల్లించాల్సినటువంటి జీతాలు రెండు రోజుల ముందుగానే పూర్తి చేయాలి అనీ ఈ వేతన కోడ్ నిర్దోషిస్తోంది. అలాగే సంస్థలు కూడా ఉద్యోగుల పని గంటలను పెంచుకోవచ్చు. అటువంటి సమయంలో ఉద్యోగులకు అదనంగా సెలవులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

అలాగే ఉద్యోగి సంస్థల సహకారంతో ఎక్కువ మొత్తం పిఎఫ్ లో జత కానుంది. 2019లో పార్లమెంట్ ఆమోదించిన ఈ లేబర్ కోడ్ 29 కార్మిక చట్టాలను భర్తీ చేస్తుంది. అయితే రాజీనామా నుండి తొలగించిన తర్వాత ఉద్యోగి చివరి పని దినం వరకు చెల్లించిన బకాయిలను రెండు రోజులలో పూర్తి చేయాలి అని ఈ కొత్త చట్టం ఆదేశిస్తుంది. కాగా ప్రస్తుతం కంపెనీలు సెటిల్మెంట్ కు 45 నుంచి 60 రోజులకు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కొత్త కార్మిక చట్టంలో సంస్థలు ఉద్యోగుల పని గంటలను 9 గంటల నుంచి 12 గంటలకు పెంచేందుకు అనుమతిని ఇస్తుంది. అలాగే ఉద్యోగులు ప్రస్తుతం వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేస్తుండగా కొత్త పని వేళలతో వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. వారానికి మూడు రోజులు సెలవులు కావాలి అనుకుంటే ప్రతివారం 48 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. వారంలో 48 గంటలు దాటితే సదరు ఉద్యోగికి సంస్థలు అదనంగా కూడా ఓవర్ టైం చెల్లించాల్సి ఉంటుంది.