Padma Vibhushan : పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్న వెంకయ్యనాయుడు, చిరంజీవి

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు

  • Written By:
  • Publish Date - April 22, 2024 / 09:37 PM IST

సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డు ప్రదానోత్సవం (Padma Awards ) అట్టహాసంగా జరిగింది. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Former Vice President of India M Venkaiah Naidu), టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పద్మ విభూషణ్ (Padma Vibhushan) పురస్కారాలు అందుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నటుడు మిథున్ చక్రవర్తి, మాజీ గవర్నర్ రామ్ నాయక్, గాయని ఉషా ఉతుప్, పారిశ్రామికవేత్త సీతారాం జిందాల్‌లకు పద్మభూషణ్ ను రాష్ట్రపతి ప్రదానం చేశారు. దాదాపు 67 మంది ప్రముఖులకు నేడు (ఏప్రిల్ 22) అవార్డులు అందజేశారు. మిగిలిన అవార్డులను వచ్చే వారం ప్రదానం చేసే అవకాశం ఉంది. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈసారి కేంద్రం ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మ శ్రీ పురస్కారాలు ప్రకటించింది.

Read Also : Vontimitta: అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల‌ క‌ల్యాణం, వేలాదిగా హాజరైన భక్తులు