Pratibha Patil Hospitalised : హాస్పటల్ లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్..

  • Written By:
  • Publish Date - March 14, 2024 / 11:15 AM IST

భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ (Pratibha Patil) అస్వస్థతకు గురికావడం తో మహారాష్ట్రలోని పుణెలో ఉన్న భారతీ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో ఆమె బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రతిభా పాటిల్​ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

భారత్‌కు రాష్ట్రపతిగా పనిచేసిన తొలి మహిళగా ప్రతిభా పాటిల్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె 2007 నుంచి 2012 వరకు పదవిలో ఉన్నారు. అంతకుముందు 2004 నుంచి 2007 రాజస్థాన్​లో గవర్నర్​గా పనిచేశారు ప్రతిభా పాటిల్​. 1991 లోక్​సభ ఎన్నికలో ఎంపీగా గెలుపొందారు. ఆమె భర్త దేవీసింగ్‌ షెకావత్‌ గతేడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో కన్నుమూశారు. అప్పట్లో ఆయన మృతిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. సామాజిక సేవతో తనదైన ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ సానుభూతి ప్రకటించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతగా, మహారాష్ట్రలోని అమరావతి నగర తొలి మేయర్‌గా విశేష సేవలందించారని శరద్‌పవార్‌ కొనియాడారు.

Read Also : Prabhas : ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు