Manmohan Singh : మహాన్ మన్మోహన్.. పార్లమెంటరీ ప్రస్థానానికి నేటితో తెర

Manmohan Singh : మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్‌సింగ్‌ 33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానం ఈరోజుతో ముగియనుంది.

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 12:54 PM IST

Manmohan Singh : మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్‌సింగ్‌ 33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానం ఈరోజుతో ముగియనుంది. రాజ్యసభ నుంచి మొత్తం 54 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తుండగా..  వారిలో ది గ్రేట్ (91) కూడా ఉన్నారు. సాహసోపేత ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టిన మన్మోహన్‌ సింగ్ 1991 అక్టోబరులో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహా రావు సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్‌లో ఆర్థికమంత్రిగా పనిచేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు దేశ ప్రధానిగా మన్మోహన్ సేవలందించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంక్షోభ సమయాల్లో గ్రామీణ కార్మికులకు ఎంతో ఉపశమనం కలిగిస్తోంది.మన్మోహన్‌ సింగ్ స్థానంలో ఇటీవల రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ నామినేట్ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join

రాజ్యసభ నుంచి పదవీవిరమణ చేస్తుండటంతో మన్మోహన్ సింగ్‌పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశంసలు కురిపించారు. మన్మోహన్‌ను(Manmohan Singh) మధ్యతరగతి, యువత ఆకాంక్షలకు హీరోగా  అభివర్ణించారు. ‘‘మీరు చేపట్టిన సంస్కరణల ప్రయోజన ఫలాలను ప్రస్తుత నాయకులు రాజకీయ పక్షపాతాల కారణంగా మీకు క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడరు’’ అని ఖర్గే పేర్కొన్నారు. ‘‘పార్లమెంటు ఇప్పుడు మీ జ్ఞానం, అనుభవాన్ని కోల్పోతుంది. మీ గౌరవప్రదమైన వ్యాఖ్యలు, రాజనీతిజ్ఞుడి లాంటి మాటలు ప్రస్తుతం అధికార పీఠంపై ఉన్న పెద్ద గొంతుకలకు భిన్నంగా ఉంటాయి.. నోట్లరద్దుపై మీరు చేసిన ప్రసంగాన్ని దేశం మరువదు’’ అని ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ అబద్ధాలను దేశం,ప్రజలు త్వరలో చూస్తారని తెలిపారు. సూర్యచంద్రులను ఎలా దాచలేమో, నిజాన్ని కూడా దాచలేం.. ప్రజలు మీ మాటల ప్రాముఖ్యతను త్వరలోనే గుర్తిస్తారని ఖర్గే చెప్పారు.

‘‘పెద్ద పరిశ్రమలు, యువ పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారాలు, వేతన వర్గాలు, పేదలకు సమానంగా ప్రయోజనకరమైన ఆర్థిక విధానాలను అనుసరించడం సాధ్యమవుతుందని మీరు చూపించారు. పేదలు కూడా దేశాభివృద్ధిలో పాలుపంచుకోవచ్చని, అభివృద్ధి చెందగలరని మీరు చూపించారు. పేదరికం నుంచి బయటపడ్డారు.. ప్రధానిగా ఉన్న సమయంలో మీ విధానాల వల్లే ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న 27 కోట్ల మంది పేదలను భారతదేశం పేదరికం నుంచి బయటపడేసింది’’ అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు.

Also Read :Prabhas : ప్రభాస్ ‘స్పిరిట్’లో కీర్తి సురేష్ హీరోయిన్.. నిజమేనా..!