Simranjit Singh Mann: పంజాబ్ మాజీ ఎంపీ, అకాలీదళ్ నేత సిమ్రంజిత్ సింగ్ మాన్..బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (BJP MP Kangana Ranaut)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల నిరసనల సందర్భంగా లైంగిక దాడులు జరిగాయని బాలీవుడ్ క్వీన్ చేసిన వ్యాఖ్యలపై సిమ్రంజిత్ సింగ్ మాన్ భగ్గుమన్నారు. లైంగిక దాడి ఎలా జరుగుతుందో మీరు ఆమెను (కంగనా రనౌత్) అడగండి, దాంతో లైంగిక దాడులు ఎలా జరుగుతాయో ప్రజలకు వివరించవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అత్యాచారాలపై ఆమెకు చాలా అనుభవం ఉందని సంగ్రూర్ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన రైతుల నిరసనలపై కంగనా రనౌత్ ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా ఎస్‌ఏడీ నేత ఈ మేరకు స్పందించారు. భారత్‌లో సమర్ధ నాయకత్వం లేకుంటే రైతుల నిరసనలు బంగ్లాదేశ్ తరహా అశాంతికి దారితీసేవని ఆమెపేర్కొన్నారు. రైతుల నిరసనల వెనుక చైనా, అమెరికా వంటి విదేశీ శక్తుల ప్రోత్సాహం ఉందని కంగనా రనౌత్ ఆరోపించారు. కాగా, మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని ఎక్స్ వేదికగా షేర్ చేసిన వీడియోలో ఆమె పేర్కొన్నారు.
సాగు చట్టాలను వెనక్కితీసుకున్నా నిరసనలు కొనసాగేలా విదేశీ శక్తులు, స్వా్ర్ధప్రయోజనాలు ఆశించే వారు ప్రోత్సహించారని దుయ్యబట్టారు. బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది, విదేశీ శక్తులు ఇందుకు కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని విమర్శించారు. బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే దుమారం రేపాయి. పంజాబ్ సీనియర్ బీజేపీ నేత హర్జిత్ గరేవాల్ కంగనా రనౌత్ వ్యాఖ్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: Telugu Bhasha Dinotsavam : తెలుగులో ట్వీట్ చేసి ఆకట్టుకున్న మోడీ