Site icon HashtagU Telugu

R K S Bhadauria : బీజేపీలోకి భారత వాయుసేన మాజీ చీఫ్ భదౌరియా

R K S Bhadauria

R K S Bhadauria

R K S Bhadauria : భారత వాయుసేన మాజీ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియా (రిటైర్డ్) రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. ఆదివారం ఆయన ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వేదికగా కాషాయ కండువా కప్పుకున్నారు. ఈకార్యక్రమంలో ఆయనతో పాటు తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాదరావు కూడా కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఈసందర్భంగా బీజేపీలో చేరినందుకు ఆర్‌కేఎస్ భదౌరియాను(R K S Bhadauria) బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే అభినందించారు. ఆయన భారత వైమానిక దళానికి సుదీర్ఘ కాలం అంకితభావంతో సేవలందించారని ప్రశంసించారు. భారత రక్షణ దళాలలో క్రియాశీల పాత్ర పోషించిన భదౌరియా.. రాజకీయ రంగంలోనూ క్రియాశీలకంగా బీజేపీకి దోహదపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో బీజేపీలోకి చేరికలు వేగాన్ని పుంజుకోవడం గమనార్హం.

Also Read : Phone Tapping Case : ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రిమాండ్‌.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

యూపీ ఎన్నికల బరిలో భదౌరియా ?

ఆర్‌కేఎస్ భదౌరియా ఉత్తరప్రదేశ్‌‌కు చెందినవారు. దీంతో ఈసారి ఆయనకు యూపీలోని ఏదైనా లోక్‌సభ టికెట్‌ను బీజేపీ కేటాయిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుందని అంటున్నారు. భదౌరియా కెరీర్ విషయానికొస్తే.. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనే డీల్‌ను ఖరారు చేయడంలో ఈయనే కీలక పాత్ర పోషించారు. రాఫెల్ ఫైటర్ జెట్స్‌తో ముడిపడిన సాంకేతిక అంశాలపై భారత ప్రభుత్వానికి గైడెన్స్ ఇచ్చింది భదౌరియానే. ఆయన 2019 సెప్టెంబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా వ్యవహరించారు. అంతకంటే ముందు వాయుసేనలో వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా సేవలందించారు. 26 విభిన్న రకాల యుద్ధ విమానాలను నడిపిన ఘనత ఆయన సొంతం. దాదాపు 4250 గంటల పాటు యుద్ధవిమానాలు, సైనిక విమానాల్లో గడిపిన రికార్డు భదౌరియాకు ఉంది. మొత్తం 36 సంవత్సరాల కెరీర్‌లో భదౌరియాకు అనేక పతకాలు లభించాయి. ఈ జాబితాలో అతి విశిష్ట సేవా పతకం, వాయు సేన పతకం, పరమ విశిష్ట సేవా పతకం ఉన్నాయి. 2019 జనవరిలో భారత రాష్ట్రపతికి గౌరవ సహాయకుడు ‘డి కాంపే’గానూ ఆయన నియమితులయ్యారు.

Also Read : Khammam: బీఆర్ఎస్‌కు మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌నుందా..? బీజేపీలోకి నామా నాగేశ్వరరావు..?