OP Kohli Passes Away: గుజరాత్ మాజీ గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం

గుజరాత్ మాజీ గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లీ (87) (OP Kohli) కన్నుమూశారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.ఢిల్లీలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
PM Modi

Resizeimagesize (1280 X 720) (3) 11zon

గుజరాత్ మాజీ గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లీ (87) (OP Kohli) కన్నుమూశారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.ఢిల్లీలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. కాగా ప్రకాష్ కోహ్లీ గుజరాత్‌తో పాటు మధ్యప్రదేశ్,గోవా రాష్ట్రాల గవర్నర్‌గా కూడా పనిచేశారు.

ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతను నోయిడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ పార్టీకి, బీజేపీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బీజేపీ బలోపేతానికి కృషి చేశానని ప్రధాని మోదీ అన్నారు. అదే సమయంలో గుజరాత్ మాజీ గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లీ మృతి పట్ల గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సంతాపం తెలిపారు.

Also Read: Earthquakes: మరోసారి రెండు భూకంపాలు.. ముగ్గురు మృతి.. 213 మందికి గాయాలు

గుజరాత్ మాజీ గవర్నర్ తన సహజమైన వ్యక్తిత్వం, విద్యా రంగంలో ఆయన చేసిన కృషికి ఎప్పటికీ గుర్తుండిపోతారని సీఎం భూపేంద్ర పటేల్ ట్వీట్ చేశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ నష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ఆయన రెండుసార్లు ఢిల్లీ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షునితో సహా బీజేపీలో అనేక పదవులు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడిగానే కాకుండా 2014 నుంచి 2019 వరకు గుజరాత్ గవర్నర్‌గా పనిచేశారు.

  Last Updated: 21 Feb 2023, 06:41 AM IST