Site icon HashtagU Telugu

Ahmedabad Air Crash – Ex-Gujarat CM : అదృష్ట సంఖ్యే దురదృష్టకరంగా మారింది!

Vijay Rupani Lucky Number

Vijay Rupani Lucky Number

అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ప్రమాదం (Ahmedabad Air Crash)లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Former Gujarat CM Vijay Rupani) దుర్మరణం చెందారు. లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో విమానంలోని 242 మంది ప్రయాణికులు మరణించారు. విమానం నివాసిత ప్రాంతాల్లో కూలిపోవడంతో అక్కడ కూడా ప్రాణనష్టం జరిగింది. విజయ్ రూపానీ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తొలుత ఆయన ఆ విమానంలో లేరని వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత అధికారులు ఆయన కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేశారు.

అయితే ఆయన లక్కీ నంబర్ 1206 (Vijay Rupani Lucky Number) అని, ఆయన పర్సనల్ వెహికల్స్ అన్నింటికీ అదే నంబర్ ఉందని జాతీయ మీడియా పేర్కొంది. నిన్న తేదీ 12/06 కావడంతో అదృష్ట సంఖ్యే ఆయనకు దురదృష్టకరంగా మారిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రూపానీ లండన్‌కు వెళ్లడానికి కారణం ఆయన భార్య. ఆమె గత ఆరు నెలలుగా లండన్‌లో ఉంటున్నారని సమాచారం. ఆమెను తిరిగి ఇండియాకు తీసుకురావడానికి విజయ్ రూపానీ లండన్ బయలుదేరారు. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇక విజయ్ రూపానీ రాజకీయ ప్రస్థానం చూస్తే..

2016 నుండి 2021 వరకు రెండు పర్యాయాలు గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా పనిచేసిన రూపానీ, మయన్మార్‌లోని యాంగోన్‌లో మాయాబెన్ మరియు రామ్నిక్‌లాల్ రూపానీలకు జైన్ బనియా కుటుంబంలో జన్మించారు. రూపానీ దంపతులకు ఏడవ మరియు చిన్న కుమారుడు. బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా రూపానీ కుటుంబం 1960లో రాజ్‌కోట్‌కు మారింది. రూపానీ ధర్మేంద్రసింహ్‌జీ ఆర్ట్స్ కాలేజీ నుండి ఆర్ట్స్ మరియు సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి లా చదివారు.

తక్కువ స్థాయి బిజెపి నాయకుడిగా, గుజరాత్ రాజకీయ వర్గాలలో పెద్దగా మాట్లాడని వ్యక్తిగా రూపానీ పేరు పొందారు. 2016లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో రూపానీ ఎదుగుతూ వచ్చారు.

కార్పొరేటర్ నుండి ముఖ్యమంత్రి వరకు

రూపానీ రాజకీయ జీవితం అనేక దశాబ్దాలుగా ఉంది. ఆయన 1987లో రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ప్రారంభించారు . 2016లో ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయన రాజ్‌కోట్ మేయర్ (1996–1997), రాజ్యసభ ఎంపీ (2006–2012) మరియు గుజరాత్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.