BJP : బీజేపీలో చేరిన మాజీ సీఎం చంపై సోరెన్‌

చంపై సోరెన్‌కు జార్ఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్‌ మరాండీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ వర్మ తదితరులు హాజరయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Former CM Champai Soren joined BJP

Former CM Champai Soren joined BJP

BJP: జార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం మాజీ నేత చంపై సోరెన్‌ బీజేపీలో చేరారు. నేడు రాంచీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చంపై సోరెన్‌కు జార్ఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్‌ మరాండీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ వర్మ తదితరులు హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, భూ కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ వ్యవహారంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ని ఈ ఏడాది జనవరిలో ఈడి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి పదవికి హేమంత్ రాజీనామా చేశారు. అయితే హేమంత్ సోరేన్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఝార్ఖండ్ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి బాధ్యతలనుంచి చంపై సోరేన్ వైదొలగడం.. మళ్లీ హేమంత్ సీఎంగా పగ్గాలు చేపట్టడం జరిగిపోయాయి.

ఈ క్రమంలో సొంత పార్టీ అధిష్టానం పై చంపై సోరేన్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని బహిరంగంగానే తెలిపారు. దీంతో ఆయన సొంత పార్టీ పెడతారనే ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. కానీ ఆయన బీజేపీ అగ్ర నాయకులతో భేటీ కావడంతో బీజేపీలో చేరతారు అనే ప్రచారం జరిగింది. స్వయంగా ఆయన బీజేపీలో చేరతనని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నేడు చంపై బీజేపీ చేరారు.

Read Also: Vishal : ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తా – హీరో విశాల్ ప్రకటన

  Last Updated: 30 Aug 2024, 05:45 PM IST