Harichandan : ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపధ్యంలో ఆయను భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన కుమారుడు పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. 2019 నుంచి 2023 వరకు బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీకి గవర్నర్‌గా సేవలు అందించారు. పలువురు నాయకులు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాగా, గత కొంతకాలంగా బిశ్వభూషణ్ హరిచందన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గడిచిన 5 నెలల్లో ఆయన ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి. అస్వస్థత కారణంగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఆయన భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ బీజేపీలో కీలకంగా వ్యవహరించారు. 2004 నుంచి 2009 మధ్య న్యాయ, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 నుంచి 2023 వరకు బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీకి గవర్నర్‌గా సేవలు అందించారు. 2023 ఫిబ్రవరి 23న ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
Read Also: Bangladesh Army : బంగ్లాదేశ్‌లో మరో తిరుగుబాటుకు రంగం సిద్ధం..?