Swati Maliwal Assault: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఈ సమయంలో బృందం ఇంటి చుట్టూ మరియు లోపల అమర్చిన సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించింది. ఘటన సమయంలో మోహరించిన భద్రతా సిబ్బందిని కూడా విచారించనున్నారు.
స్వాతి మలివాల్ ఫిర్యాదు తర్వాత ఢిల్లీ పోలీసులు గురువారం సాయంత్రం దుష్ప్రవర్తన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం స్వాతికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అర్థరాత్రి పోలీసులు ప్రధాన నిందితుడు బిభవ్ కుమార్ ఇంటికి చేరుకున్నారు, కానీ అతను అక్కడ లేడు. బిభవ్ అరెస్ట్ కోసం ఢిల్లీ పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేశారు.
స్వాతి మలివాల్ అనుచిత ప్రవర్తన కేసులో కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో మే 13 నాటిది, ఇందులో స్వాతి సీఎం నివాసంలో సెక్యూరిటీ పర్సనల్‌తో వాదిస్తూ కనిపించారు. ఈ వీడియో బయటకు రాగానే ఆప్ ఎంపీ చేసిన ఘాటు వ్యాఖ్య కూడా తెరపైకి వచ్చింది. దీని తర్వాత స్వాతి మాట్లాడుతూ.. పొలిటికల్ హిట్‌మెన్‌లు తప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని అన్నారు. దేంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Also Read: Nirmala : స్వాతి మాలివాల్‌పై దాడి ఘటన..కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి: నిర్మలా సీతారామన్