Agniveer : అగ్నివీరుల ఎంపికపై కేంద్రానికి ఆర్మీ కీలక సూచనలు

అగ్నివీర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి ప్రస్తుతం 21 ఏళ్లు ఉండగా.. దాన్ని 23 ఏళ్లకు పెంచాలని కోరింది.

Published By: HashtagU Telugu Desk
Agniveers Secunderabad

Agniveer : అగ్నివీర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఆర్మీ కీలక సూచనలు చేసింది. అగ్నివీర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి ప్రస్తుతం 21 ఏళ్లు ఉండగా.. దాన్ని 23 ఏళ్లకు పెంచాలని కోరింది. వయోపరిమితిని పెంచితే సాయుధ దళాల్లో అగ్నివీర్ విభాగంలోని సాంకేతిక ఉద్యోగాలను డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పొందే అవకాశాలు పెరుగుతాయని తెలిపింది. ప్రస్తుతం అగ్నిపథ్ ద్వారా చేరుతున్న వారిలో 25 శాతం మందినే నాలుగేళ్ల తర్వాత సైన్యంలో కంటిన్యూ చేస్తున్నారు. అయితే అగ్నివీరులుగా చేరే వారిలో కనీసం 50 శాతం మందిని నాలుగేళ్ల తర్వాత కొనసాగించాలని ఆర్మీ కోరింది. ఈమేరకు ప్రతిపాదనలతో  రక్షణ శాఖకు ఆర్మీ ఉన్నతాధికారులు ఓ నివేదికను సమర్పించారు.

We’re now on WhatsApp. Click to Join

ఈవిధమైన చర్యలను చేపడితే ఆర్మీకి చెందిన ప్రత్యేక విభాగాల్లో మానవ వనరుల కొరతను తగ్గించుకోవచ్చని ఆర్మీ అధికారులు వాదిస్తున్నారు. సైన్యం( Armed Forces) పవర్ ఫుల్‌గా మారాలంటే ఈమేరకు అగ్నివీర్ స్కీంలో మార్పులు చేయాలని అంటున్నారు. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగకాలంలో పొడిగింపును పొందే అగ్నివీరులు.. అదనంగా మరో 15 ఏళ్ల సర్వీస్ పొందుతారు. అగ్నివీరులకు(Agniveer) సాధ్యమైనంత ఎక్కువ ఏళ్ల పాటు ఉద్యోగ కాలంలో పొడిగింపును అందించడం వల్ల సైన్యం బలంగా తయారవుతుందని అంటున్నారు.

Also Read :2700 Jobs : బ్యాంకులో 2700 జాబ్స్.. తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టులు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి అగ్నివీరుల కోసం గళమెత్తారు.  ఇటీవలే అమరుడైన అగ్నివీరుడు అజయ్ కుమార్ తరఫున బలంగా వాణిని వినిపించారు. అమరుడు అజయ్ కుటుంబానికి ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అజయ్ కుటుంబానికి ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ నుంచి రూ.48 లక్షల ఇన్సూరెన్స్ వచ్చిందని.. అయితే ప్రభుత్వం నుంచి పరిహారం ఇంకా రాలేదన్నారు. పరిహారానికి, ఇన్సూరెన్స్  అమౌంటుకు చాలా తేడా ఉందని రాహుల్ చెప్పారు. అజయ్ కుటుంబం ఆవేదనను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. వెంటనే అమరుడు అజయ్ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.

Also Read :Prostitution : హైదరాబాద్ లో రాత్రి 9 దాటితే చాలు రోడ్డెక్కుతున్న వేశ్యలు

  Last Updated: 06 Jul 2024, 04:04 PM IST