Delhi: ఢిల్లీపై పొగమంచు ఎఫెక్ట్, రైలు, విమాన ప్రయాణాలకు బ్రేక్

  • Written By:
  • Updated On - December 30, 2023 / 11:33 AM IST

Delhi: శనివారం ఉదయం దేశ రాజధానిని దట్టమైన పొగమంచు కమ్ముకోవడం రైలు, విమానయాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 11.8 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఆదివారం ఉదయం వరకు పంజాబ్, హర్యానా, చండీగఢ్ మరియు ఢిల్లీలో చాలా ప్రాంతాలలో మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాలలో దట్టమైన నుండి చాలా దట్టమైన పొగమంచు పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని IMD తెలిపింది. “ఢిల్లీ పాలం స్టేషన్ 700 మీ,  సఫ్దర్‌జంగ్ 400 మీ విజిబిలిటీని ఉదయం 9 గంటలకు నమోదు అయ్యింది” అని వాతావరణ నిపుణులు తెలిపారు.

దృశ్యమానత వరుసగా 999 మీ నుండి 500 మీ, 499 మీ నుండి 200 మీ, 199 మీ నుండి 50 మీ, <50 మీ వరకు ఉంటుంది. రోజుai గడిచేకొద్దీ పొగమంచు క్రమంగా పేరుగుతోంది. మధ్యాహ్నం నాటికి స్పష్టమైన వాతావరణాన్ని నెలకొంటుంది. ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు పేరుకుపోవడంతో విమానాలు, రైళ్లు కొన్నిచోట్లా నిలిచిపోయాయి. అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రద్దయ్యే అవకాశం ఉంది. శనివారం తెల్లవారుజామున తక్కువ దృశ్యమానత కారణంగా 70కి పైగా అంతర్జాతీయ మరియు దేశీయ విమానాలు రాక పోకలు గంటల తరబడి ఆలస్యమైంది. దీంతో ప్రయాణికుల్లో నిరాశ నెలకొంది.