Site icon HashtagU Telugu

FM Nirmala Sitharaman : లోక్ సభ లో తల బాదుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

Nirmala Rahul

Nirmala Rahul

లోక్ సభ (Lok Sabha) లో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య వాడి వేడి వార్ నడుస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రవేశ పెట్టిన బడ్జెట్ (Budget) ఫై ప్రతిపక్ష పార్టీలు అగ్రం వ్యక్తం చేస్తూ..దేశ వ్యాప్తంగా ఉన్న సమస్యల పట్ల కేంద్రానికి సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదే క్రమంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) ఫై రాహుల్ (Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తం చేసారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ‘హల్వా’ వేడుకలో నిర్మల పాల్గొన్న ఫొటోను ఆయన సభలో ప్రదర్శించారు. ‘ఫొటోలో దళిత, ఆదివాసీ, OBCలకు చోటే లేదు. అలాంటి ప్రభుత్వం బడుగుబలహీన వర్గాలకు ఏం ప్రయోజనం చేకూరుస్తుంది’ అని మండిపడ్డారు. ఈ క్రమంలో నిర్మలా.. రాహుల్ వ్యాఖ్యలకు తల బాదుకున్నారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

అలాగే దేశం పరిస్థితి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా మారిపోయిందని రాహుల్ ఆరోపించారు. గతంలో నా మాటలతో కొందరు భయపడ్డారు. బీజేపీలో ఒక్క వ్యక్తే ప్రధాని కావాలని అనుకుంటారు. బీజేపీలో ఎవరైనా ప్రధాని కావాలని కలలు కంటే మరుక్షణం నుంచి వారు భయపడాల్సిందే. బీజేపీని చూసి దేశంలో అన్ని వర్గం భయపడుతున్నాయి. దేశంలో యువత, రైతులు, కార్మికులు అందరూ భయపడుతున్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు ఆందోళన చేశారు. రైతులకు ఎంఎస్‌పీ ఇస్తామని చట్టం చేయాలి. రైతులకు ఇప్పటివరకు స్పష్టమైన హామీ లభించలేదు. కేంద్రం విధానాలు చూసి రైతులు భయపడుతున్నారు. రైతుసంఘాల నేతలతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. కరోనా సమయంలో మధ్యతరగతి ప్రజలంతా ప్రధాని చెప్పినట్లు చేశారు. ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి వారిపై అదనపు భారం వేశారు. వారికి ఎలాంటి లబ్ధి కలిగించలేదు. మా హయాంలో నిబంధనలు సడలించి రైతులకు రుణమాఫీ చేశాం అని రాహుల్ చెప్పుకొచ్చారు.

Read Also : Nabha Natesh : పై అందాల మెరుపులతో షాకిస్తున్న నభా నటేష్