Site icon HashtagU Telugu

Ahmedabad Airport: అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులోకి భారీగా వరదనీరు.. తీవ్ర అవస్థలు పడుతున్న ప్రయాణికులు?

Ahmedabad Airport

Ahmedabad Airport

గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో చాలా రాష్ట్రాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా రోడ్లు,రైల్వేస్టేషన్ లు,బస్టాండ్లు అన్నీ కూడా జలమయమయ్యాయి. కాగా హైపర్ ఆది ప్రాంతాలు అయినా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, భారీ వర్షాల కురుస్తుండడంతో ప్రదేశాలన్నీ కూడా అతలాకుతలమయ్యాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వానలతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి.

తాజాగా కురిసిన వర్షాలకి అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నీట మునిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ప్రయాణికులు ప్రధాని సొంత రాష్ట్రంలో ఎయిర్ పోర్ట్ నిర్వాహణ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులతో సహా పలువురు నెటిజన్లు విమానాశ్రయం వరదల్లో మునిగిపోయిందని, రన్‌వేలు, టెర్మినల్ ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయని అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ వెలుపల రోడ్డు నీటమునిగింది. భారీవర్షాలు, వరదల వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.

 

కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త దీపక్ ఖత్రీ అహ్మదాబాద్ విమానాశ్రయం టెర్మినల్ వెలుపల నీటిలో నిండిన రహదారి వీడియోను షేర్ చేశారు.. అంతేకాకుండా భారీ వర్షాలతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. జునాగఢ్ జిల్లాలో భారీ వరద ప్రవాహంలో కార్లు, పశువులు కొట్టుకుపోయాయి. ఈ వరదల కారణంగా కార్లు ఆట బొమ్మలుగా మారి కోట్లు లక్షలు విలువ చేస్తే కార్లు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలో కారు కోసం వెళ్లి కుటుంబ సభ్యుల కళ్ళ ముందే వరదల్లో కొట్టుకుపోయాడు. మరోవైపు నవ్‌సారి పట్టణంలో గ్యాస్ సిలిండర్లు వరదల్లో కొట్టుకుపోయాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, గుజరాత్ లో భారీ వర్షాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.