Flipkart UPI : ‘ఫ్లిప్‌కార్ట్ యూపీఐ’ వచ్చేసింది.. విశేషాలివీ

Flipkart UPI : పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పేలతో పోటీపడేందుకు ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ ‘ఫ్లిప్‌కార్ట్’ కీలక నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 02:14 PM IST

Flipkart UPI : పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పేలతో పోటీపడేందుకు ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ ‘ఫ్లిప్‌కార్ట్’ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్లాట్‌ఫామ్‌లో పేమెంట్స్ చేసే యూజర్స్ కోసం సొంత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ‘ఫ్లిప్‌కార్ట్’ యాప్ లోపల, బయట ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పేమెంట్స్ ఈజీగా చేయొచ్చు. యాక్సిస్ బ్యాంకుతో కలిసి యూపీఐ సర్వీసును ‘ఫ్లిప్‌కార్ట్’ అందుబాటులోకి తెచ్చింది. తొలివిడతగా ఈ సర్వీసు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. రానున్న రోజుల్లో పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యూపీఐ  యాప్‌లపై యూజర్లు ఆధారపడటాన్ని తగ్గించాలని ‘ఫ్లిప్‌కార్ట్’ యోచిస్తోంది. అందుకే కొత్తగా యూపీఐ సేవను అందుబాటులోకి తెచ్చింది.

We’re now on WhatsApp. Click to Join

‘ఫ్లిప్‌కార్ట్ యూపీఐ’ వాడటం ఇలా.. 

  • ఈ కొత్త ఫీచర్‌‌ను వాడేందుకుగానూ యూజర్లు తొలుత ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో యూపీఐ ఐడీని క్రియేట్ చేయాలి.
  • దీన్ని వాడుకొని వ్యాపారులు, వ్యక్తులు ఇద్దరికీ పేమెంట్స్ చేయొచ్చు.
  • ఫ్లిప్‌కార్ట్ సంస్థకు 50 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్స్, 14 లక్షల మంది విక్రేతలు ఉన్నారు.
  • పేమెంట్ సమయంలో సూపర్‌కాయిన్‌లు, బ్రాండ్ వోచర్‌లు, ఇతర అనేక రివార్డులు, ప్రయోజనాలను కూడా  ఫ్లిప్‌కార్ట్ అందించనుంది.
  • మింత్రా, ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, ఫ్లిప్‌కార్ట్ హెల్త్+, క్లియర్‌ ట్రిప్‌ సహా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కంపెనీల్లో అంతర్గత యూపీఐ సౌకర్యం ఉంటుంది.
  • దేశంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల స్టార్టప్ కంపెనీల్లో ఒకటిగా ఫోన్ పే నిలుస్తోంది. ఫోన్ పే కంపెనీలో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌కు  మెజారిటీ వాటాలు ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ కంపెనీ కూడా వాల్‌మార్ట్‌దే అనే సంగతి మనకు తెలిసిందే.
  • ఇటీవలి కాలంలో దేశంలోని ఈ కామర్స్ సంస్థలు తమ కస్టమర్ల సౌలభ్యం కోసం సొంతంగా యూపీఐ చెల్లింపుల వ్యాపారంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
  • ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కూడా తన UPI సేవను ప్రారంభించింది.
  • వాట్సాప్, మేక్ మై ట్రిప్ కంపెనీలు సైతం వాటి సొంత యూపీఐ చెల్లింపు హ్యాండిల్స్‌ను కలిగి ఉన్నాయి.
  • ఫిబ్రవరి నెలలో మనదేశంలో జరిగిన యూపీఐ లావాదేవీల విలువ దాదాపు రూ.18.3 లక్షల కోట్లు.

Also Read : Darling : మహిళను ‘డార్లింగ్’ అని పిలిచినా లైంగిక వేధింపే : హైకోర్టు