Site icon HashtagU Telugu

Building Collapse : కోల్‌కతాలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఇద్దరు మృతి

Five Storey Building Collap

Five Storey Building Collap

 

 

Building Collapse : పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా(Kolkata)లో నిర్మాణంలో (Building Collapse) ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది(Building Collapse). ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకు 13 మందిని రక్షించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాకా గార్డెన్‌ రీచ్‌ ప్రాంతంలోని ఓ కాలనీలో ఈ ఘటన జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

సమాచారం అందుకున్న పోలీసులు(police ), రెస్క్యూ సిబ్బంది(Rescue personnel) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వాళ్లను హుటాహుటిన దవాఖానకు తరలించారు. సోమవారం ఉదయం రంగంలోకి దిగిన 50 మంది సభ్యులతో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ప్రస్తుతం అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నది. కాగా, భవనంలో ఎవరూ లేరని స్థానికులు తెలిపారు. కానీ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న గుడిసెలపై శిథిలాలు పడ్డాయని చెప్పారు. ఇంకా పదుల సంఖ్యలో శిథిలాల్లో చిక్కుకుని ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

read also: Telangana SSC: కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ప్రారంభం

ఘటనా స్థలాన్ని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సందర్శించారు. సహాయక చర్యలను గురించి అధికారులను అడిగితెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసహాయం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో ఇద్దరు మరణించారని, మరో ఐదారుగురు శిథిలాల్లో చిక్కుకుపోయారని చెప్పారు. మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.