ఆదివారం తెల్లవారుజామున పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి (Bus Falls Into Ditch) ఐదుగురు మృతి (Five Dead) చెందగా, మరో 17 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలౌన్ జిల్లా మధుఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌పురా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. గోపాల్‌పురా గ్రామ సమీపంలో బస్సును మరో వాహనం ఢీకొట్టడంతో అది కాలువలో పడిపోయిందని పోలీసు సూపరింటెండెంట్ ఇరాజ్ రాజా తెలిపారు. జిల్లాలోని మండేలా గ్రామానికి పెళ్లి బృందం తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
Also Read: Karnataka Election 2023: ఖర్గే హత్య ఆరోపణలపై మణికాంత్ రాథోడ్ రియాక్షన్
సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) జలౌన్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు. దీంతో పాటు క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చూడాలని జిల్లా యంత్రాంగం అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదంలో 5 మంది మృతి, 17 మందికి గాయాలు
బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారని జలౌన్ జిల్లాలో పెళ్లికి వచ్చిన అతిథులతో వెళ్తున్న బస్సు గుర్తు తెలియని వాహనం ఢీకొని బోల్తాపడటంతో అందులో 5 మంది చనిపోగా, 17 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని తెలిపారు.
Also Read: lemons Hinduism : హిందూమతంలో నిమ్మకాయకు ఎందుకంత ప్రాధాన్యత ?
మృతుల్లో రఘునందన్ (48), కుల్దీప్ సింగ్ (38), శిరోమన్ (65) జలౌన్ వాసులు కాగా, బస్సు డ్రైవర్ కల్లు, కండక్టర్ వికాస్ రాజావత్ మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా వాసులు. ప్రమాదంలో గాయపడిన వారిని బ్రిజేంద్ర, అశోక్, లల్తా ప్రసాద్, వీర్ సింగ్, శివశంకర్, సుందర్, కల్లు, శివసింగ్, మహిపాల్, లల్లు, రాజేంద్ర, రవీంద్రగా గుర్తించారు. గాయపడిన ప్రయాణికులను ఒరై మెడికల్ కాలేజీకి తరలించినట్లు ఎస్పీ తెలిపారు.