Site icon HashtagU Telugu

Vande Bharat Sleeper : పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు

Vande Bharat Sleeper

Vande Bharat Sleeper

Vande Bharat Sleeper : భారతీయ రైల్వేలో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేయబోతోంది. దేశంలో తొలిసారిగా వందే భారత్ స్లీపర్ రైలును సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఇప్పటివరకు వందే భారత్ రైళ్లు డే-ట్రావెల్ కోసం మాత్రమే అందుబాటులో ఉండగా, స్లీపర్ వేరియంట్‌తో రాత్రి ప్రయాణికులకూ అధునాతన సౌకర్యాలు లభించనున్నాయి.

అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం భారత రైల్వేలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని చెప్పారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ రాపిడ్ రైల్ వంటి ఆధునిక రైళ్లు ఇప్పటికే నడుస్తున్నాయని, ఇప్పుడు స్లీపర్ వందే భారత్ రైలును కూడా జాబితాలో చేర్చుతున్నామన్నారు.

ఆదివారం భావ్‌నగర్ టెర్మినస్ నుండి మూడు కొత్త రైళ్లు – అయోధ్య ఎక్స్‌ప్రెస్, రేవా-పుణె ఎక్స్‌ప్రెస్, జబల్‌పూర్-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ – లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి పాల్గొన్నారు.

Tollywood : టాలీవుడ్‌లో సమ్మె సైరన్.. షూటింగ్స్ బంద్, వేతనాలపై వివాదం

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు పనులు వేగంగా కొనసాగుతున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తొలి బుల్లెట్ రైలు త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ బుల్లెట్ రైలు గంటకు 320 కి.మీ వేగంతో నడుస్తుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) నుంచి ప్రారంభమై వాపి, సూరత్, ఆనంద్, వడోదర, అహ్మదాబాద్ వరకు ప్రయాణిస్తుంది. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటలు 7 నిమిషాలకు తగ్గుతుంది.

ఇప్పటివరకు 34,000 కి.మీ కంటే ఎక్కువ కొత్త రైల్వే ట్రాక్‌లు వేయబడ్డాయి. రోజుకు సుమారు 12 కి.మీ ట్రాక్‌లు వేస్తున్నామని, ఇది భారత రైల్వే చరిత్రలో మొదటిసారి జరుగుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 1,300 స్టేషన్లను పునరాభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి స్టేషన్లుగా మార్చే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

పోర్బందర్ నుంచి రాజ్‌కోట్ వరకు వాన్స్‌జాలియా, జెటల్సర్ మీదుగా కొత్త రైలు సర్వీసును ప్రవేశపెట్టనున్నారు. రణవావ్ స్టేషన్లో రూ. 135 కోట్లతో ఆధునిక కోచ్ నిర్వహణ సౌకర్యం అభివృద్ధి చేస్తున్నారు.

Jagadeesh Vs Kavitha : కవిత జ్ఞానానికి నా జోహార్లు – జగదీష్ రెడ్డి కౌంటర్