J&K: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై పరుగులు తీయనున్న ట్రైన్

జమ్మూ కాశ్మీర్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి చీనాబ్ రైలు వంతెనపై త్వరలో రైళ్లు పరుగులు తీయనున్నాయి. చీనాబ్ నదికి దాదాపు 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన.

J&K: జమ్మూ కాశ్మీర్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి చీనాబ్ రైలు వంతెనపై త్వరలో రైళ్లు పరుగులు తీయనున్నాయి. చీనాబ్ నదికి దాదాపు 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. జమ్మూకశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లా సంగల్దాన్‌, రియాసీ మధ్య కొత్తగా నిర్మించిన చీనాబ్‌ రైల్వే బ్రిడ్జిని రైల్వే అధికారులు ఆదివారం పరిశీలించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాచారం ఇచ్చారు. మొదటి ట్రయల్ రైలు సంగల్దాన్ నుండి రియాసి వరకు విజయవంతంగా నడిచింది. ఇందులో చీనాబ్ వంతెనను కూడా దాటుతుంది. USBRL కోసం అన్ని నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి, సొరంగం నంబర్ వన్ మాత్రమే పాక్షికంగా అసంపూర్ణంగా ఉందన్నార.

చీనాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో మొత్తం 30,000 మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగించారు. 1486 కోట్లతో ఈ వంతెనను నిర్మించారు. ఇది గంటకు 260 కి.మీ వేగంతో గాలులను తట్టుకోగలదు. ఈ వంతెన ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ కింద నిర్మించబడింది. ఈ రైలు 7 స్టేషన్ల మీదుగా బారాముల్లా చేరుకుంటుంది. లోయ ప్రజల రాకపోకలను సులభతరం చేయడమే దీని ఉద్దేశం.

Also Read: Drug Overdose: ఓవర్ డోస్ డ్రగ్స్ కారణంగా యువకుడు మృతి