Vande Sadharan Train : అదిరిపోయే సౌకర్యాలతో వందే సాధారణ్ ట్రైన్.. ఫస్ట్ లుక్ ఇదిగో

Vande Sadharan Train : వందే భారత్ ఎక్స్ ప్రెస్  ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Published By: HashtagU Telugu Desk
Vande Sadharan Train

Vande Sadharan Train

Vande Sadharan Train : వందే భారత్ ఎక్స్ ప్రెస్  ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వందేభారత్ ట్రైన్ టికెట్స్ సామాన్యులకు అందుబాటులో లేవు. వాటి రేట్లు చాలా ఎక్కువ. అందుకే సామాన్యులకూ టికెట్ రేట్లు అందుబాటులో ఉండేలా వందే సాధారణ ట్రైన్స్ ను త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. తొలిసారిగా వందే సాధారణ్ ట్రైన్ ఫొటోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో వందే సాధారణ్ ట్రైన్స్ తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఫొటోలలోనూ వాటి మేకింగ్ జరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

Also read : Another shock to TDP : చంద్రబాబు బయటకు రాకుండా ఏపీ సర్కార్ మరో పిటిషన్..

వందే సాధారణ్ రైళ్లలోనూ వందేభారత్ రైళ్ల తరహాలో కొన్ని సౌకర్యాలు ఉంటాయి. వందే సాధారణ్ రైళ్లలో 24 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉండే అవకాశం ఉంది. బయో-వాక్యూమ్ టాయిలెట్లు, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఛార్జింగ్ పాయింట్లు వంటివి ఉంటాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా కోచ్‌లలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాదిరిగా వందే సాధారణ్ ట్రైన్స్ లోనూ ఆటోమేటిక్ డోర్ సిస్టమ్‌ ఉంటుంది. అయితే వందే సాధారణ్ రైళ్లు ఎప్పటిలోగా ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయనే దానిపై పూర్తి క్లారిటీ లేదు. ఈ సంవత్సరం చివరినాటికి మొదటి వందే సాధారణ్ రైలు సేవలు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. 

  Last Updated: 11 Sep 2023, 02:47 PM IST