Indias First Prabal : మేడిన్ ఇండియా “ప్రబల్” రివాల్వర్‌.. ఆగస్టు 18 నుంచి బుకింగ్స్!

Indias First Prabal : 50 మీటర్ల దూరంలోని లక్ష్యాలను గురిపెట్టగల లాంగ్‌ రేంజ్‌ రివాల్వర్‌ ను స్వదేశీ టెక్నాలజీతో ఇండియా డెవలప్ చేసింది.  

  • Written By:
  • Updated On - August 15, 2023 / 05:19 PM IST

Indias First Prabal : 50 మీటర్ల దూరంలోని లక్ష్యాలను గురిపెట్టగల లాంగ్‌ రేంజ్‌ రివాల్వర్‌ ను స్వదేశీ టెక్నాలజీతో ఇండియా డెవలప్ చేసింది.  ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అడ్వాన్స్‌డ్‌ వెపన్స్‌ అంగ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్‌ (AWEIL) సంస్థ ఈ రివాల్వర్‌ను తయారు చేసింది.ఈ రివాల్వర్‌ కు ప్రబల్‌ అని పేరు పెట్టింది.  ప్రబల్‌ బుకింగ్స్‌ ఆగస్టు 18 నుంచి ప్రారంభమవుతాయి. త్వరలోనే దీన్ని దేశ భద్రతా బలగాలకు అందించనున్నట్టు సమాచారం.  ప్రబల్‌ రివాల్వర్‌ బరువు తక్కువ. 76 మి.మీ బ్యారెల్‌తో ఈ రివాల్వర్‌  700 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. గన్  లైసెన్స్‌ కలిగిన సామాన్యులు సైతం దీన్ని(Indias First Prabal) కొనొచ్చు.

Also read : Rejected 13 Job Offers : ఆమె 13 జాబ్ ఆఫర్స్ కు నో చెప్పింది.. ఆ తర్వాత ఏమైందంటే ?

కేంద్ర ప్రభుత్వ ఆధ్యర్యంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్‌ (OFB) పునర్నిర్మాణంలో భాగంగా 7 పీఎస్‌యూలను 2021లో ఏర్పాటు చేసింది. వాటిలో AWEIL కూడా ఒకటి. ఈ సంస్థ భద్రతా దళాల కోసం ఆయుధాలను తయారు చేస్తుంది. ఈ ఒక్క ఏడాదే AWEIL సంస్థ రూ.6 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన ఆర్డర్లను పొందింది. 300 సారంగ్‌ ఫిరంగుల తయారీకి భారత సైన్యం నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. రూ.450 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల తయారీ కోసం  యూరోపియన్‌ దేశాల నుంచి ఆర్డర్‌లు వచ్చాయి.

Also read : Rajastan: సీమా హైదర్ ఫాలో అయినా మరో మహిళ.. ప్రియుడు కోసం ఏకంగా అలాంటి పని?