Moon Images-Chandrayaan3 : మన “చంద్రయాన్” పంపిన చందమామ వీడియో

Moon Images-Chandrayaan3 : చంద్రయాన్-3  స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని వీడియోలు తీసి పంపింది.

  • Written By:
  • Updated On - August 22, 2023 / 03:41 PM IST

Moon Images-Chandrayaan3 : చంద్రయాన్-3  స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని వీడియోలు తీసి పంపింది.

ఆ వీడియోల్లో చంద్రుడి ఉపరితలం దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వాటిని చూస్తుంటే.. మనం ఏదో బస్సులోనో, ట్రైన్ లోనో జర్నీ చేస్తూ చంద్రుడిని చూస్తున్నామా అనిపిస్తోంది!!

తాజాగా ఆ వీడియో ఫుటేజీని ఇస్రో ట్విట్టర్ వేదికగా  రిలీజ్ చేసింది.  

ఆగస్టు 5న చంద్రుని కక్ష్యలోకి ఎంటర్ కాగానే.. ఈ వీడియోను చంద్రయాన్-3 అంతరిక్ష నౌక తీసిందని ఇస్రో  వెల్లడించింది. 

చంద్రయాన్-3 మిషన్ ఇప్పటివరకు సజావుగా సాగుతోందని, అంతరిక్ష నౌకలో ఉన్న  “విక్రమ్” ల్యాండర్ ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుందని ఇస్రో అంచనా వేసింది.

చంద్రయాన్-3  ప్రాజెక్ట్ వ్యయం రూ.600 కోట్లు అని ఇస్రో(Moon Images-Chandrayaan3) వెల్లడించింది.