Rajasthan: రాజస్థాన్‌లో రెండు రోజుల్లో క్యాబినెట్ విస్తరణ

రాజస్థాన్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మొదటి క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. రెండు రోజుల్లో క్యాబినెట్ విస్తరణ జరగనుంది. భజన్ లాల్ శర్మ ఈ నెల ప్రారంభంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

Rajasthan: రాజస్థాన్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మొదటి క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. రెండు రోజుల్లో క్యాబినెట్ విస్తరణ జరగనుంది. భజన్ లాల్ శర్మ ఈ నెల ప్రారంభంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, డిప్యూటీలుగా దియా కుమారి మరియు ప్రేమ్ చంద్ బైర్వా ప్రమాణ స్వీకారం చేశారు. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో ముఖ్యమంత్రితో సహా గరిష్టంగా 30 మంది మంత్రులకు అవకాశం ఉంది.

సోమవారం లేదా మంగళవారం మొదటి క్యాబినెట్ విస్తరణ జరగనుంది.మంత్రి మండలిలో దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉంది.కేబినెట్‌లో యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దాంతో పాటుగా అనుభవం ఉన్న శాసనసభ్యులు కూడా ఉంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కేబినెట్‌లో బాబా బాలక్‌నాథ్‌, శైలేష్‌ సింగ్‌, నౌక్షమ్‌ చౌదరి, సందీప్‌ శర్మ, జవహర్‌ సింగ్‌ బేడం, మహంత్‌ ప్రప్తాప్‌ పూరీలకు కేబినెట్‌ పదవులు దక్కే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి శర్మ ఇటీవల ఢిల్లీలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఇతరులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయాలను ఆయన వారితో చర్చించినట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి మరియు అతని ఇద్దరు డిప్యూటీలు జైపూర్ జిల్లాలోని నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనందున, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి మంత్రులుగా ఉంటారని ఆ వర్గాలు తెలిపాయి. శర్మ సంగనేర్ నుండి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా, దియా కుమార్ మరియు బైర్వా వరుసగా విద్యాధర్ నగర్ మరియు డూడు నుండి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.

Also Read: Rs 500 Gas Cylinder : రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఈ స్కీమ్‌కు ఆ కార్డులే ప్రామాణికం ?