Site icon HashtagU Telugu

Gujarat Elections : సహోద్యోగులపై కాల్పులు..ఇద్దరు CRPFజవాన్లు మృతి, మరో ఇద్దరికి గాయాలు..!!

Crpf

Crpf

త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించగా…మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన పోరు బందరులో జరిగింది. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్లు మణిపూర్ కు చెందినవారుగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం…ఎన్నికల విధుల్లో ఉన్న ఒక ఉద్యోగి కాల్పులు జరపడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. జవాన్లందరూ కూడా మణిపూర్ చెందిన సీఆర్ఫీఎఫ్ బెటాలియన్ కు చెందినవారేనని కలెక్టర్ ఎఎంశర్మ తెలిపారు. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో విధులు నిర్వహించేందుకు వచ్చినట్లు వెల్లడించారు.

అయితే ఎందుకు కాల్పులు జరిపాడన్న దానికి పూర్తి వివరాలు తెలియలేదు. పోరుబందరులో డిసెంబర్ 1న మొదటివిడత ఎన్నికలు జరగనున్నాయి. పోరుబందరుకు 25కిలోమీటర్ల దూరంలో ఉన్న తుక్డా గోసా గ్రామంలో జవాన్లు బస చేశారు. ఏదో తెలియని సమస్యపపై ఒక జవాన్ తన తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపాడు. వారంతా అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారని జిల్లా కలెక్టర్ తెలిపారు. గాయపడ్డ జవాన్లను జామ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.