Site icon HashtagU Telugu

Bihar: పాట్నా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య కాల్పులు..!!

Patna

Patna

బీహార్ లోని పాట్నా యూనివర్సిటీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. శనివారం విద్యార్థి సంఘాల ఎన్నికలు ముగిసిన తర్వాత క్యాంపస్ లో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు…యూనివర్సిటీ గేటు వద్ద కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు యూనివర్సిటీకి చేరుకున్నారు. శాంతి భద్రత పర్యవేక్షణ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.