Tamil Nadu: తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 10 మంది మృతి

తమిళనాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది చనిపోయారని ప్రాధమిక సమాచారం. తమిళనాడు విరుదునగర్ సమీపంలోని ముత్తుసామి పురంలో విజయ్‌కు చెందిన బాణాసంచా ఫ్యాక్టరీ నడుస్తోంది.

Tamil Nadu: తమిళనాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది చనిపోయారని ప్రాధమిక సమాచారం. తమిళనాడు విరుదునగర్ సమీపంలోని ముత్తుసామి పురంలో విజయ్‌కు చెందిన బాణాసంచా ఫ్యాక్టరీ నడుస్తోంది. అయితే ఈ రోజు యధావిధిగా పనులు జరుగుతుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 30 మంది అక్కడ పనిచేస్తున్నట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారని, వారిలో 7 మంది మృతదేహాలను గుర్తించామని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. క్రాకర్స్‌లో మందు కలిపే సమయంలో రాపిడి వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది.

బాణాసంచా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి సంతాపం తెలిపారు.బాణాసంచా కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంతీవ్ర బాధకు గురి చేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయడమే కాకుండా, అగ్ని ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, వారికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మరియు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి వెంటనే నష్టపరిహారం అందించాలని డిఎంకె ప్రభుత్వాన్ని కోరారు.

Also Read: Telangana Assembly : అసెంబ్లీ టీవీలో మాముఖాలు చూపించరా..? ఇంత అన్యాయమా..? – హరీష్ రావు