Site icon HashtagU Telugu

Mahakal Temple: ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి ఆలయంలో అగ్నిప్రమాదం

Fire at Ujjain Mahakaleshwar temple

Fire at Ujjain Mahakaleshwar temple

 

Mahakal Temple: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి (Ujjain Mahakal Temple) ఆలయంలో అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. హోలీ(Holly) సందర్భంగా మహాకాళేశ్వరుడి(mahakaleshwar)కి భస్మ హారతి (Bhasma Aarti) ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు(fires) అంటుకున్నాయి. దీంతో ఐదుగురు పూజారులతోపాటు మరో ఎనిమిది మంది భక్కులు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడున్నవారు వెంటనే వారిని స్థానిక దవాఖానకు తరలించారు. సోమవారం ఉదయం భస్మ హారతి సమయంలో మహాకాల్‌కి గులాల్‌ సమర్పిస్తున్నప్పుడు ధూలెండి కారణంగా అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయని ఓ పూజారి చెప్పారు. గాయపడినవారు దవాఖానలో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు.

కాగా, ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ స్పందించారు. భస్మహారతి సమయంలో అనుకోకుండా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఎప్పటికప్పుడు తాను అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నాని తెలిపారు. ప్రస్తుతం అంతా అదుపులోనే ఉందని వెల్లడించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాని ట్వీట్‌ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆలయంలో అగ్నిప్రమాద ఘటన విషయమై సీఎం మోహన్‌ యాదవ్‌తో మాట్లాడానని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. గాయపడినవారికి చికిత్స అందించడానికి స్థానిక అధికారులు సహాయం చేస్తున్నారని ఎక్స్‌ వేధికగా వెల్లడించారు.

Read Also: Firefox Browser Users: ఈ బ్రౌజ‌ర్ వాడేవారికి బిగ్ అల‌ర్ట్‌.. ఎందుకంటే..?