ముంబైలోని ఎత్తైన భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సెంట్రల్ ముంబైలోని దాదర్‌లోని ఎత్తైన భవనంలోని 22వ అంతస్తులో గురువారం రాత్రి పెద్ద మంటలు చెలరేగాయని, ఆ తర్వాత నిర్మాణంలోని ఇతర భాగాలకు వ్యాపించిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 42 అంతస్తుల రెసిడెన్షియల్ టవర్, ఆర్‌ఏ రెసిడెన్సీలోని 22వ అంతస్తులో రాత్రి 8.30 గంటలకు మూసి ఉన్న ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయని ఫైర్ అధికారులు తెలిపారు. భవనంలోని 42వ అంతస్థులోని ఎలక్ట్రిక్ ప్యానెల్‌లో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదని.. భవనంలోని అగ్నిమాపక వ్యవస్థ పనిచేయలేదని తెలిపారు. 16 ఫైర్ ఇంజన్లు, రెండు ఫైర్ టెండర్లు, 90 మీటర్ల ఎత్తైన క్రేన్, ఇతర పరికరాల సహాయంతో మంటలను ఆర్పేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) చీఫ్ ఫైర్ ఆఫీసర్, ఇద్దరు అదనపు చీఫ్ ఫైర్ ఆఫీసర్లు, ఇతర సీనియర్ అధికారులు ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. నాలుగు అంబులెన్స్‌లు కూడా అందుబాటులో ఉంచామరి అధికారులు తెలిపారు.
Fire Accident : ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం

Fire