Delhi Assembly elections : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహిళలకు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతినెలా రూ.2100 ఆర్థికసాయం కేజ్రీవాల్ చేస్తామని ప్రకటించారు. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని కేజ్రీవాల్ హామీనిచ్చారు. కాగా, ఇప్పటికే ఆటో డ్రైవర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు కీలక హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆప్‌ను గెలిపిస్తే 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకూ నెలకు రూ.2,100 అందజేస్తామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. అర్హులైన మహిళల ఎంపికకు శుక్రవారం నుండే దరఖాస్తును స్వీకరిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. అయితే మరో 10 నుండి 15 రోజుల్లోగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు ఈ పథకంను అమలు చేసి లబ్దిదారులకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమచేయడం సాధ్యం కాదని కేజ్రీవాల్ అన్నారు.
కాగా, గురువారం ముఖ్యమంత్రి అతిశీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రతి మహిళకు రూ.1,000 ఇస్తామని గతంలో హామీ ఇచ్చాము. అయితే, కొంతమంది మహిళలు నా వద్దకు వచ్చి ద్రవ్యోల్బణం కారణంగా రూ.1,000 సరిపోవడం లేదని చెప్పారు. అందుకే వారి అభ్యర్థన మేరకు 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలకు రూ.2,100 ఇస్తాం అని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలోకే ఈ మొత్తాన్ని జమ చేయనున్నుట్లు వెల్లడించారు.
Read Also: 2024 -25 INCOME TAX Records : FY25లో ట్యాక్స్ రీఫండ్ చెల్లింపుల్లో సరికొత్త రికార్డ్