Site icon HashtagU Telugu

Pre Budget Meetings: అక్టోబర్ 10 నుంచి ప్రీ బడ్జెట్ సమావేశాలు..!

Taxes Reduce

Taxes Reduce

Pre Budget Meetings: ఫిబ్రవరి 1, 2024న ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌ (Pre Budget Meetings)కు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని బడ్జెట్ విభాగం 2024-25 బడ్జెట్‌కు సంబంధించి ఒక సర్క్యులర్‌ను ఇటీవల విడుదల చేసింది. దీనిలో అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల నుండి వారి బడ్జెట్‌కు సంబంధించిన ఇన్‌పుట్‌లను కోరింది. అక్టోబర్ 5, 2023లోగా తమ ఇన్‌పుట్‌లను సమర్పించాల్సిందిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మంత్రిత్వ శాఖలు, విభాగాలను కోరింది. కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా బడ్జెట్‌కు సంబంధించి తమ సూచనలు ఇవ్వాలని కోరింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ కార్యదర్శి.. ఈ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో అక్టోబర్ 10 నుండి నుండి ప్రీ-బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తారని బడ్జెట్ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అంతకు ముందు బడ్జెట్‌కు సంబంధించి తమ డిమాండ్ల జాబితాను అందజేయాలని అన్ని శాఖలు, మంత్రిత్వ శాఖలను ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది.

మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024న బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఏప్రిల్ 2024 నుంచి దేశంలో లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇటువంటి పరిస్థితిలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి బడ్జెట్‌ను సమర్పించే వరకు ప్రభుత్వ ఖర్చులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను కవర్ చేయడానికి మధ్యంతర బడ్జెట్ తయారు చేయబడింది.

Also Read: Petrol Rates: రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!

మధ్యంతర బడ్జెట్‌లో ప్రజాకర్షక ప్రకటనలు చేయడం ఆనవాయితీ కాదు. లోక్‌సభ ఎన్నికల ముందు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మోదీ ప్రభుత్వం ఈ మధ్యంతర బడ్జెట్‌లో కూడా ప్రజాకర్షక ప్రకటనలు చేయవచ్చని పలువురు భావిస్తున్నారు. గత సారి 2019లో మోదీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజనను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల మోడీ ప్రభుత్వానికి విపరీతమైన ఎన్నికల ప్రయోజనాలు కూడా లభించాయి. ఈసారి మధ్యతరగతి ప్రజలను ఆకర్షించడానికి మోడీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కొత్త స్కీమ్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో ఆదాయపు పన్ను మినహాయింపు ప్రధానమైనది.

కొత్త ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది

కొత్త లోక్‌సభ ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం జూలై 2024లో పూర్తి బడ్జెట్‌ను సమర్పిస్తుంది. పూర్తి బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం తెలుపుతుంది. అప్పటి వరకు ప్రభుత్వ ఖర్చుల కోసం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.